ఫిట్‌నెస్‌ విత్‌ బ్యూటీ : సమంతా లేటెస్ట్‌ ఫోటో వైరల్‌ | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ విత్‌ బ్యూటీ : సమంతా లేటెస్ట్‌ ఫోటో వైరల్‌

Published Thu, May 23 2024 5:42 PM

 Star Actress Samantha Ruth Prabhu tricep dips, beautiful looks viral

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఒడి దుడుకులు, భర్తతో విడాకులు,  ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ బారిన పడటం లాంటి కారణాలరీత్యా తన ఫిట్‌నెస్‌కు ఇచ్చే  ఇంపార్టెన్స్‌ మరింత పెరిగింది.  దీనికి సంబంధించి అనేక వీడియోలను, ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. 

తాజాగా  కండలు తిరిగి భుజాలతో కూడిన ఒక బ్యూటిఫుల్‌ ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అంతేకాదు మరిన్ని ట్రైసెప్స్ డిప్స్‌ రాబోతున్నాయనే హింట్‌ కూడా ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే 3 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయంటేనే  అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సుమంత బెస్ట్‌ ఫ్రెండ్‌, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా సమంతా ఫిట్‌ బాడీని ఫిదా అయిపోయింది. ‘నీ ఫిట్నెస్‌లో సగమైనా సాధించాలని ఆశపడుతున్నాను’ అంటూ కమెంట్‌ చేయడం గమనార్హం.

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement