
మంచి మంచి రీల్స్‌తో ఆకట్టుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్సర్‌లు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం చాలా రిస్క్ తీసుకుంటారు. అది వాళ్ల అభిరుచి కావొచ్చు కూడా. కానీ ఆ రీల్స్ ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉండకూడదు. అవి ఆరోగ్యదాయకంగానూ, ఆహ్లాదంగానూ ఉండాలి. అయితే ఇక్కడొక ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అత్యుత్సాహంతో మరింత క్రియేటివిటీ కోసం చేసిన పని విమర్శలపాలు చేసింది. చివరికి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది
ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఢిల్లీకి చెందిన ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కొత్త ట్రెండ్ సెట్‌చేసే క్రమంలో డేరింగ్ స్టంట్ రీల్ చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే ఆమె అది ఎలాంటి సాహసోపేతమైన స్టంట్ అనేది పరిగణించలేదు. కేవలం వ్యూస్, క్రేజ్ కోసం ఏకంగా స్పీడ్‌గా దూసుకపోతున్న రైలు పక్కనే పరిగెడుతున్నట్లు చేసిన వీడియోని షేర్‌చేసింది.
అందులో రైలు ఆమెను దాటి వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పైగా "రైలుతో పరుగు'అనే క్యాప్షన్‌ని జత చేసి మరీ పోస్ట్ చేయడంతో మరింత ఆగ్రహం తెప్పించేలానే కాకుండా తప్పుదోవ పట్టించేలా కూడా ఉంది. అసలు ఇది ఫిట్‌నెస్ అవేర్‌నెస్ లేక ఎంత రిస్క్ చేసి అయినా ప్రాణాలు పోగొట్టుకోవడమెలా? అని సందేశం ఇస్తున్నావా..? అని మండిపడుతూ పోస్టులు పెట్టారు.
డేరింగ్ స్టంట్‌కి అర్థమే మార్చేస్తున్నారా కథా..! మీరు అని మరొకందరూ విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. డేరింగ్ స్టంట్ అంటే కళ్లు ఆర్పడమే మర్చిపోయేలా ఉండాలి గానీ ఇదేంటిరా బాబు అని తలపట్టుకునేలా ఉంటే ఇలానే ఉంటుందేమో..!.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..:
(చదవండి: ఖండాంతరాలు దాటిన నృత్యం)