బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్‌నెస్‌ కోచ్‌ ఏమంటున్నారంటే.. | Sakshi
Sakshi News home page

బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్‌నెస్‌ కోచ్‌ ఏమంటున్నారంటే..

Published Mon, May 20 2024 3:52 PM

Fitness Coach Said Do Not Have to Stop Eating Rice To Lose Weight

బరువు తగ్గేందుకు రకరకాల డైట్‌లు ఫాలో అవుతాం. ముఖ్యంగా రైస్‌ని దూరంగా ఉంచుతారు. ఎక్కువగా పండ్లు, చిరుధాన్యాల మీద ఆధారపడుతుంటారు. ఒక్కోసారి నచ్చిన కూర ఉన్న కూడా బరువు విషయం గుర్తించి భారంగా దూరం పెట్టేస్తాం రైస్‌ని. ఇంతకి రైస్‌ వల్లే బరువు పెరిగిపోతామా? దీనిపై ఫిట్‌నెస్‌ కోచ్‌లు ఏమంటున్నారంటే..

చాలామంది బరువు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అ‍న్నంతో బరువు ముడిపడి ఉందని నమ్ముతుంటారు. అందువల్ల అన్నం తినడం తగ్గించేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గే యత్నంలో అన్నంకి దూరంగా ఉంటారు. అయితే ఇది ఎంతమాత్ర నిజం కాదని తేల్చి చెబుతున్నారు ఫిట్‌నెస్‌ కోచ్‌ సిమ్రాన్‌. బరువు తగ్గడంలో రైస్‌ని హాయిగా తింటూనే ఎలా నియంత్రించవచ్చో వివరించారు. 

ఎలాంటి చింత లేకుండా హాయిగా రైస్‌ని ఆస్వాదిస్తూ తినొచ్చని చెబుతున్నారు. అందుకోసం చేయాల్సింది ఏంటో వెల్లడించారు. భోజనం తినడానికి కనీసం 10 నుంచి 12 నిమిషాల ముందు ఒక గ్లాస్‌ నీటిని హాయిగా తీసుకోండి. తర్వాత మంచి సలాడ్‌ కొద్దిగా తీసుకోండి. ఆ తర్వాత నచ్చిన భోజనం హాయిగా తినండి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినండి. అలాగే పెరుగు అన్నం కూడా స్కిప్‌ చెయ్యొద్దు మంచిగా లాగించేయండని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ కోచ్‌ సిమ్రాన్‌. 

అంతేగాదు అన్నం తినడం వల్ల మధుమేహం రాదని, కేవలం అతిగా తినటం వల్ల వస్తుందని చెప్పారు. అలాగే యాక్టివ్‌గా ఉండేందుకు యత్నించండి, సమతుల్య ఆహారం బాగా తినండి, కాస్త కామన్‌ సెన్స్‌తో వ్యవహరిస్తూ నెట్టింట్‌లో చెప్పే ప్రతి చిట్కాను ఫాలో అవ్వకండి అని చెబుతున్నారు. అన్న తినడం వల్ల బరువు పెరుగుతాం అనే భావనను వదిలించుకోండి. శరీరం హెల్తీగా ఉండాలంటే మనస్ఫూర్తిగా అన్నం తినాలనే విషయాన్ని గ్రహించండి. 

(చదవండి: కొత్త హెయిర్‌ స్టైల్‌లో విరాట్‌ కోహ్లీ..వావ్‌!అంటూ ఫ్యాన్స్‌ కితాబు!)
 

Advertisement
 
Advertisement
 
Advertisement