శభాష్‌ ఖుషీ! | Khushi Kapoor Lifts 290kg in Stunning Fitness Feat | Sakshi
Sakshi News home page

శభాష్‌ ఖుషీ!

Aug 3 2025 3:03 AM | Updated on Aug 3 2025 3:03 AM

Khushi Kapoor Lifts 290kg in Stunning Fitness Feat

ఇండస్ట్రీలో రాణించాలంటే యాక్టింగ్‌ ప్రతిభతోపాటు స్క్రీన్‌పై ఫిట్‌గా కూడా కనిపించాల్సి ఉంటుంది. ఆ ఫిట్‌నెస్‌ కోసం కఠినమైన కసరత్తులు చేస్తుంటారు తారలు. ఇందులో భాగంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ కూడా చేస్తుంటారు. అయితే ఓ అమ్మాయి ఓ వంద కేజీలు బరువు ఎత్తితేనే హాట్‌ టాపిక్‌ అయిపోతుంది. అలాంటిది ఖుషీ కపూర్‌ జిమ్‌లో ఏకంగా 290 కేజీల బరువును లిఫ్ట్‌ చేయడంతో చాలామంది షాక్‌ అయ్యారు.

దివంగత ప్రముఖ తార శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ హిందీ సినిమాలు చేస్తున్నారు. ఓ హీరోయిన్‌గా ఫిట్‌గా ఉండటం కోసం ఆమె వర్కౌట్స్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే హిప్‌ థ్రస్ట్‌ వర్కౌట్‌లో భాగంగా 290 కిలోల బరువును ఖుషీ కపూర్‌ లిఫ్ట్‌ చేశారు. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, ఆమె సోషల్‌ మీడియా ఫాలోయర్స్‌ విభిన్నరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

కొందరు శభాష్‌ ఖుషీ అని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈ ముద్దుగుమ్మకు ఎంత కష్టం వచ్చిందో అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఖుషీ కపూర్‌ సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారట. మంచి మాస్‌ కమర్షియల్‌ సబ్జెక్ట్‌ లేదా డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయడానికి ఆమె ఇష్టపడుతోందని రెగ్యులర్‌ లవ్‌స్టోరీ, గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌... వంటివి చేసే ఆలోచన ప్రస్తుతానికి ఖుషీకి లేదని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement