
విదేశీయులు మనదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడటం కొత్తేం కాదు, గానీ తాజాగా జిమ్ పరంగా కూడా భారత్‌నే మేటి అనే కితాబిచ్చేసింది ఓ విదేశీ మహిళ. వాస్తవానికి మనకంటే అత్యాధునిక టెక్నాలజీని అనుసరించే పాశ్చాత్య దేశాలు..ఫిట్‌నెస్ విషయంలో మనకంటే ముందుంటారు. అలాంటిది భారత్‌లోని జిమ్ సౌకర్యమే బాగుటుందని చెబుతోంది. ఇక్కడ ట్రైనర్స్ శిక్షణే బాగుంటుందని, ఈ విషయంలో యూరప్ దేశాలు భారత్‌ని నేర్చుకోవాలంటూ చురకలంటిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
ఎనిమిదేళ్లకుపైగా భారత్‌లోనే నివశిస్తున్న విక్టోరియా చక్రవర్తి భారత్ జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్నట్లు పేర్కొంది. యూరోపియన్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీ భారతీయ జిమ్ సౌకర్యం నుంచి చాలా నేర్చుకోవాలని అంటుంది. రూల్స్, సేవలు, వెసులబాటు వరకు అంతా సామాజిక వాతావరణం ఉంటుంది. ఆ పరంగా ఇరు దేశాల మధ్య జిమ్ సంస్కృతిలో చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగు పాఠాలను తప్పక నేర్చుకోవాలని అంటోంది.
ఆ నాలుగు పాఠాలు.
సరసమైన ధరలో జిమ్ సౌకర్యం దొరుకుతుంది. అధికంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అలాగే తక్కువ ధరకే పూర్తి సౌకర్యాలందించే జిమ్‌లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది
కమ్యూనిటీ వెబ్: భారతీయ జిమ్‌లు సామాజికంగా కనిపిస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటారు, చిట్కాలు పంచుకుంటారు, ఒకరినొకరు గుర్తిస్తారు, ట్రైనర్ పేరును కూడా తెలుసుకుంటారు. యూరప్‌లోలా ఎవరికివారుగా ఉండరు.
జిమ్‌లు సాధ్యమైనంత త్వరితగతిన తెరుచుకుంటాయి. నెల ఇట్టే గడిచిపోతుంది. విద్యార్థులు, కొత్తగా నేర్చుకునేవారికి ప్రత్యేక నిపుణుల సూచనతో కూడిన శిక్షణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయంలో యూరప్ జిమ్‌లో వార్షిక ఒప్పందాలు ఉంటాయి. అవి కూడా కఠిన నిబంధనలని అంటోంది విక్టోరియా.
అలాగే భారత్‌లో ట్రైనర్ల సలహాలు సూచనలకు అధనంగా సొమ్ము చెల్లించాల్సిన పని ఉండదు. భారత్‌లో ఫిట్‌నెస్ ట్రైనర్లు తమ శిక్షకులకు స్వయంగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కూడా. ఇలాంటి వ్యక్తిగత శ్రద్ధ కొరకు యూరప్‌లో అదనంగా చెల్లించాలని అంటోంది. ఫిట్‌నెస్ పరంగా భారత్ నుంచి యూరప్ చాలా నేర్చుకోవాలని, భారత్‌లా ఉండాలని అంటోంది.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెతో ఏకభవించడమే కాదు, భారతీయ సంస్కృతిని ఇంతలా ఇష్టపడుతున్నందుకు ధన్యావాదాలు చెప్పారు పోస్టులyో. కాగా, సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ విక్టోరియా గతంలో తనను చాలామంది భారత్‌కు వెళ్లవద్దని సూచించినట్లు వెల్లడించింది. అయితే ఆమె ఇక్కడకి రావడమే గాక ప్రేమలో పడటమేగాక ఇక్కడే వ్యాపారాన్ని కూడా నిర్మించిన తన విజయవంతమైన ప్రస్థానాన్ని అంతకుమునుపే పంచుకుంది కూడా.
(చదవండి: నలభై ఏళ్ల తల్లి వెయిట్‌లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..)