కిక్‌ బాక్సింగ్‌తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...! | Check these beauties and fitness freaks Rashmika, Janhvi kapoor and AliaBhatt | Sakshi
Sakshi News home page

కిక్‌ బాక్సింగ్‌తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!

Jan 16 2025 11:46 AM | Updated on Jan 25 2025 4:27 PM

Check these beauties and fitness freaks Rashmika, Janhvi kapoor and AliaBhatt

బాలీవుడ్, టాలీవుడ్‌ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్‌ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం  లేకుండా ఫిట్‌గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్‌–ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఇదీ...

ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి  చూపు అంటూ టాలీవుడ్‌ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ తెరపై గ్లామర్‌ డోస్‌ని విజృంభించి పంచే హీరోయిన్స్‌లో టాప్‌లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్‌ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్‌మిల్‌ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్‌నెస్‌ రొటీన్‌లో బెంచ్‌ ప్రెస్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్‌లు, షోల్డర్‌ ప్రెస్‌లు  పుల్‌–అప్‌ల ద్వారా బాడీ షేప్‌ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్‌ ఫిజిక్‌ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.

‘కిక్‌’ ఇచ్చేంత అందం...
వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్‌ పీలింగ్స్‌ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్‌ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్‌కి వెళుతుందామె.  ఆమె ఫిట్‌నెస్‌ రొటీన్‌లో స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్, వెయిట్‌ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్‌ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌కి ఉపకరించే కోర్‌ వర్కౌట్‌లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్‌గా ఉండటానికి ఇంట్లో పవర్‌ యోగా, స్విమ్మింగ్‌  చేస్తుంది.  ఇటీవలే రష్మిక తన ఫిట్‌నెస్‌ మెనూలో అధిక–తీవ్రత గల కిక్‌బాక్సింగ్‌ సెషన్‌లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్‌ చేయడానికి  ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.

దీపికా...అందం వెనుక...
జవాన్‌ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్‌ హీట్‌ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్‌ యోగా, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ కార్డియోను  సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్‌ ట్రైనింగ్‌ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్‌ రొటీన్‌ను డిజైన్‌ చేసుకుంటుంది.

కార్డియో...ఆలియా...
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్‌ అలియా భట్‌ తాజాగా జిగ్రా  మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్‌ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్‌ హీరోయిన్‌.. ఫిట్‌గా  ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్‌ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్‌లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్‌ బాల్‌ ఫ్యాన్‌ క్లబ్‌లోని సెలబ్రిటీస్‌ లిస్ట్‌లో తానూ చేరింది.

కత్తిలా..కత్రినా..
తెలుగులో విక్టరీ వెంకటేష్‌ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్‌...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్‌ ఈజ్‌ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్‌తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ల సమ్మేళనాన్ని పొందుపరిచింది.  

అందమైన ఆ‘కృతి’...
ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్‌ సరసన నటించిన సీత...కృతి సనన్‌ అంతకు ముందు దోచెయ్‌ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్‌కి కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా  బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్,  కోర్‌ వర్కౌట్‌లతో శ్రమిస్తుంటుంది.   వ్యాయామాల ద్వారా తన పోస్చర్‌ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement