
వయసుతో సంబంధం లేకుండా కొందరు అద్భుతాలు చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. అదికూడా లేటు వయసులో సాహసోపేతమైన పనులు చేసి వయసు అనేది శరీరానికే గానీ మనసుకు కాదని చేతల్లో చూపిస్తుంటారు. వృద్ధాప్య దశలో పీజీలు, పీహెచ్‌డీలు చేస్తే..కొందరు మాత్రం ఆ వయసుకి సాధ్యవుతాయా..? అనేలా ఛాలెంజింగ్ సాహసాలకు పూనుకుని, రికార్డులు సృష్టిస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ 91 ఏళ్ల బామ్మ. ఈమె ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. శాస్త్రవేత్తలక సైతం ఆమె చురుకైన యాక్టివిటీని చూసి కంగుతిన్నారు.
ఇటలీకి చెందిన 91 ఏళ్ల ఎమ్మా మరియా మజ్జెంగా(Emma Maria Mazzenga) అనే బామ్మ 90 ప్లస్ 200 మీటర్ల రన్నింగ్ రేసులో ఊహకందని విధంగా ప్రపంచ రికార్డును సృష్టించింది. జస్ట్ ఒక్క నిమిషంలోపే రన్నింగ్ రేస్‌ని ముగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆ వయసులో మరొకరి సాయం లేనిదే అడుగులు వేయలేరు. కానీ ఆమె మాత్రం చాలా వేగంగా పరుగులు తీయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.
పైగా ఎలాంటి ఆయాసం లేకుండా యువకుల మాదిరిగా అత్యంత ఉత్సాహంగా పరుగులు తీయడం అత్యంత షాకింగ్ విషయం. ఆమె తోటివారందరూ ఆయాసంతో ఆందోళపడుతుంటే..ఆమె మాత్రం చాలా ప్రశాంతంగా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇది శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షించింది. ఈ వయసులో ఆ బామ్మ మజ్జెంగా ఇంత చురుగ్గా ఉండటానికి వెనుకున్న ఆరోగ్య రహస్యం ఏంటా అని ఆసక్తిని రేకత్తించింది. చివరికి అదేంటో సవివరంగా తెలుసుకున్నారు కూడా.
ఇక్కడ బామ్మ 200 మీటర్ల పరుగును కేవల 51.47 సెకన్లలో పూర్తిచేసి, మునుపటి 90-ప్లస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. ఇంత వేగంగా చేయడానికి ఆమె శరీరం ధర్మం ఎలా సహకరిస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. అందుకోసం ఆమెకు శారీరక కసరత్తులకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించి మరీ ఆమె ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకున్నారు.
90 ఏళ్ల వయసులో బామ్మను సూపర్ ఫిట్‌గా ఉండేలా చేసినవి..
పుణుల అభిప్రాయం ప్రకారం బామ్మ మజ్జెంగా వండర్ ఉమెన్. అందుకు రెండే రెండు ప్రధాన అంశాలని చెబుతున్నారు.
ఆమె కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌లో ఆమె గుండె,ఊపిరితిత్తులు, రాలకు ఆక్సిజన్‌ను పంప్ చేసే విధానం 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన మహిళతో సమానంగా ఉంటుందట.
ఆమె కండరాలు ప్రత్యేకమైనవి మరియు తక్కువ బర్నింగ్‌ని కలిగి ఉంటాయి. అంటే ఎనర్జీని కోల్పోకుండా ఉండటంతో అలిసిపోతు. అందువల్లే ఆమె సుదురాలకు సులభంగా పరిగెత్తగలతు.
ఆమెలో "చాలా ఎక్కువ శాతం" వేగవంతమైన సంకోచ ఫైబర్‌లు కూడా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవే ఆమె వేగవంతమైన కదిలికలకు కారణమని అన్నారు.
ఈ ప్రత్యేకమైన లక్షణాలే ఈ 200 మీటర్ల రన్నింగ్ రేసులో అలవోకగా రికార్డు చేచేసందుకు దారితీసిందని చెబుతున్నారు డాక్టర్ మార్టా కొలోసియో.
ఈ ప్రత్యేకమైన శరీరాకృతి ఎలా వచ్చిందంటే..
ఆమె దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తోంది. అదే ఆమె శరీరానికి వరంగా మారింది
1933లో జన్మించిన మజ్జెంగా మొదట విశ్వవిద్యాలయంలో తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది, 100, 200, 400 మరియు 800 మీటర్ల రేసుల్లో కూడా పోటీ పడింది. అప్పటి నుంచే ఆమె విజయపరంపర మొదలైంది. ఆరోజుల్లో రోమ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో నాల్గవ స్థానంలో నిలిచింది.
తన విజయాలకు బ్రేక్‌పడింది పెళ్లి, పిల్లలు అనే చెప్పొచ్చు. అలా ఆమె రెండు దశాబ్దలకు పైగా తన ఫిట్‌నెస్ కెరీర్‌కు దూరంగాఉంది.
మళ్లీ తిరిగి 1986లో తన కెరీర్ రన్నింగ్ రేస్‌లోకి వచ్చింద. అంటే.. 50ల వయసులో తన పాత సహచరులతో పోటీ పడటం మొదలైంది. మళ్లీ పుంజుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చినా..ఈ రన్నింగ్ రేసులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుందని అంటోంది బామ్మ.

అదే కారణం..
ఒక రేసు ఇచ్చే కిక్కే వేరు అంటోంది. ప్రతి శిక్షణా సెషన్ తనకు మంచి జీవితకాల వ్యాయామ శిక్షణ, అసాధారణ పనితీరుని అందిస్తుందట. అందువల్లే తొమ్మిది పదుల వయసులో కూడా ఇంతలా యువ క్రీడాకారులతో సరితూగేలా పోటీపడగలను అంటోంది. కాగా, బామ్మ ఐదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది యూరోపియన్ రికార్డులు, మాస్టర్ స్ప్రింటింగ్ విభాగంలో 28 ఉత్తమ ఇటాలియన్ పెర్ఫామెన్స్‌గా అవార్డులు గెలుచుకుంది. ఈ బామ్మ నేటి యువతరానికి ఎంతోస్ఫూర్తి కదూ..!.
(చదవండి: పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!)