ఫిట్‌నెస్‌ కోసం హోం జిమ్‌! | Home gym created by IIT graduates | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ కోసం హోం జిమ్‌!

Oct 26 2024 1:01 PM | Updated on Oct 26 2024 1:03 PM

Home gym created by IIT graduates

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్‌గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అరొలీప్‌ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్‌ ఖాతాలో తెలిపారు.

ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్‌ గుడ్‌న్యూస్‌

‘ఈ హోమ్‌ జిమ్‌ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్‌ సైన్స్‌ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్‌మెంట్లు, హోటల్‌ రూమ్‌ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్‌, ఫిజికల్‌ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఈ కంపెనీలో స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధా సీఈవో నితిన్‌ కామత్‌ కూడా ఇన్వెస్ట్‌ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్‌ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement