
లవర్ బాయ్‌లా ఉండే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఒక్కసారిగా కండలు తిరిగిన దేహంతో కనిపించి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ చేశాడు. ఫిట్‌నెస్ కోచ్ శిక్షణలో తీవ్రమైన కసరత్తు చేసి ఫిట్‌గా కనిపించాడు. అయితేతాజాగా రణబీర్‌ను తీర్చిదిద్దిన ఫిట్‌నెస్ కోచ్ శివోహం భట్ వెయిట్ లాస్ పై ఉన్న అపోహలు గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. బరువు తగ్గాలంటే కొత్త డైటీమీ అవసరం లేదు... అశాస్త్రీయమైన వాటిని నమ్మకుండా ఉండే చాలు అని హితవు పలికారు. ఫిట్‌నెస్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ మూడు మిత్స్ ఏంటో చూసేద్దామా మరి.
శివోహం భట్ ప్రకారం కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే. దీని వల్ల మజిల్స్ బర్స్ అవుతాయి,కానీ కరిగేది కొవ్వు కాదని తేల్చారు. అపోహలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దచాలా మంది తక్కువ తినడం, ఎక్కువ పని చేయడం అనేది కొవ్వు తగ్గడానికి కీలకమని భావిస్తారు. దీని వల్ల తీవ్రమైన కేలరీల లోటులోకి వెళ్లిపోతారని శివోహం హెచ్చరించారు.
ఆకలి మెటబాలిజాన్ని తగ్గించేస్తుంది (Starving Slows Metabolism) దీనివల్ల వాస్తవానికి ఏమి జరుగుతుంది? బాడీ సర్వైవల్ మోడ్‌లోకి వెళుతుంది. కొవ్వును కరిగించడానికి బదులుగా శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మెటబాలిజం నెమ్మదిస్తుంది. మజిల్ అనేది మెటబాలిజాన్ని యాక్టివ్‌గా ఉంచే టిష్యూ. ఇది విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను బర్న్ చేస్తుందన్నారు. కాబట్టి ఆకలితో ఉండటం వల్ల, స్కేల్ పడిపోతుంది. శరీరం నీరసించిపోతుంది. అంతిమంగా ఇది తిరిగి మళ్లీ కొవ్వు పేరుకుపోవడానికే దోహదపడుతుంది. అందువల్ల బరువు తగ్గడం అంటే తక్కువ తినడం కాదు సరిగ్గా తినడం అన్నారు.
చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్‌తో సెంచరీ కొట్టేశా!
కార్డియో కేలరీలను బర్న్ చేస్తుందా?
కార్డియో చేస్తే ఎక్కువకేలరీలు బర్న్ అవుతాయనుకుంటారు. ఆపివేసిన మరుక్షణం, కేలరీల బర్న్ కూడా ఆగిపోతుందని శివోహామ్ భట్ గుర్తు చేశారు. వెయిట్ ట్రెయినింగ్ భిన్నంగా ఉండాలి. బరువులు ఎత్తినప్పుడు మజిల్స్ దృఢపడతాయి. ఇవి జీవక్రియ రేటును పెంచుతాయి, అంటే నిద్రపోతున్నప్పుడు కూడా. అందుకే అధిక కొవ్వును కరిగించుకోవాలన్నా, సన్నగా మారాలన్న, కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ రెండూ ఉండాలని సూచించారు.
డిసిప్లీన్ బెస్ట్: డిసిప్లీన్ పవర్ ఫుల్.. మోటివేష్, విల్‌వపర్ ఇవన్నీ ఒక ట్రాప్. ఇవి లేక చాలామంది ఇబ్బంది పడతారు. ప్రోటీన్-రిచ్ న్యూట్రిషన్, డీప్ రికవరీ (నిద్ర), స్థిరత్వం ఇదే బెస్ట్ ఫార్ములా. ఇవే గేమ్ చేంజర్స్ అన్నారు. అంతేకానీ ఫ్యాట్ బర్నర్స్, డీటాక్స్ టీలు, క్రాష్ డైట్ ఇవన్నీ తాత్కాలిక చిట్కాలు మాత్రమే అని శివోహామ్ భట్ పేర్కొన్నారు. లేనిపోని హైప్ ఇవ్వడం కాకుండా అలవాట్లను పెంపొందించేలా చూస్తాడు ఫిట్నెస్ కోచ్ . అన్ని సమస్యలకు నిబద్ధతే పరిష్కారమని శివోహామ్ తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్