
వందేళ్లు ఆరోగ్యంగా బతికిన ఓ పెద్దాయన నా దీర్ఘాయువుకు కారణాలివే అంటూ ఏడు చిట్కాలను పంచుకున్నాడు. అమెరికాకు చెందిన శతాధిక వృద్ధుడు సి లిబర్‌మాన్, జీవిత అనుభవాలు, ఆచరణ, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అక్టోబర్ 13న ది వాషింగ్టన్ పోస్ట్ వ్యాసంలో 101 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన సి లిబర్‌మాన్ తన దీర్ఘాయుష్షు రహస్యాలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంలో ముఖ్యంగా నాజీ జర్మనీపై శత్రువుల కాల్పుల నుండి బయటపడటం, తీవ్రమైన మాంద్యం పరిస్థితులు తదితర విషయాలను షేర్ చేశాడు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా కష్టాలు తప్పలేదు. గుండెపోటు, కోమాలోకి వెళ్లి బయటపడటం లాంటి అద్భుతమైన జీవిత అనుభవాలు ఉన్నాయి..
ఆయన దీర్ఘాయువుకు కారణమైన ఏడు చిట్కాలు
సంబంధాలపై దృష్టి (Focus on relationships): బంధాలు అనుబంధాలపై దృష్టిపెట్టడం ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని తెలిపారు. 76 వైవాహిక జీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండే భార్య డోరతీ(97), అద్భుతమైన ఇద్దరు పిల్లలు, మరెంతో ప్రేమగా ఉండే మనవరాళ్లు తన జీవితాన్ని ప్రభావితం చేశారన్నారు.
సిగరెట్ తాగవద్దు (Don't Smoke) : ధూమపానం చేయకపోవడమే ప్రదానమైంది. తన చిన్నతనంలో తన స్నేహితులు దాదాపు అందరూ ధూమపానం చేసినా తాను మాత్రం దాని జోలికి పోలేదని తెలిపారు. పెళ్లికాకముందు తన భార్య అప్పుడప్పుడు ధూమపానం చేసేదనీ , మెల్లిగా దాన్ని తాను మానిపించగలిగానని చెప్పారు.
వ్యాయామం, ఆహారం (Exercise and eat healthy): ఎల్లప్పుడూ ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించాలని సూచించారు. అల్పాహారంగా పండ్లు, ఆహారంలో ఎక్కువగా చేపలు ఉంటాయి. దీంతో పాటు 14 సంవత్సరాల క్రితం ఫ్లోరిడాకు వెళ్లినప్పటినుంచి బీచ్‌లో నడవడం, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం లాంటివి ఉన్నాయని చెప్పారు.
సానుకూల దృక్పథం (positive attitude): ఎన్ని కష్టాలొచ్చినా, ఎప్పుడూ నిరాశ చెందలేదు. కష్టాల్లో జీవిస్తూనే పరిస్థితులు మెరుగు పడతాయనే సానుకూల వైఖరి మంచి ఫలితాలనిస్తుందని చెప్పుకొచ్చారు.
తగిన వైద్య సంరక్షణ (appropriate medical care) : ఆరోగ్య పరిస్థితులకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి, ఆధునిక వైద్యం అద్భుతాలు నాకు చాలా లాభించాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వైద్య సలహాలు తీసుకోవాలన్నారు.
నచ్చిన పని, మీనింగ్‌పుల్‌గా చేయడం (Do work you find meaningful): ప్రైవేట్ యాజమాన్యంలోని పత్రిక ఆస్బరీ పార్క్ సండే ప్రెస్‌కు ఎడిటర్‌గా పనిచేశా. 40 ఏళ్లకు పైగా జర్నలిస్ట్‌గా చాలెంజింగ్ అండ్ రివార్డింగ్ జాబ్ అది చాలా ఇష్టం చేశా. ఇప్పటికీ బిజీగా ఉండటానికి రాస్తాను.
కొంచెం అదృష్టం (Be a little lucky): నిజంగా భార్యతో చాలా అందమైన జీవితాన్ని గడిపాను. ఆమె కొన్ని జ్ఞాపకశక్తి సమస్య ఉన్నా, రాత్రి నిద్రపోయే ముందు నన్ను ముద్దు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. మనల్ని ప్రేమించే, మన గురించి కేర్ తీసుకునే మనిషితో జీవించడం దీర్ఘాయువుకు చాలా తోడ్పడతుంది అంటారాయన.