మేరా ఫుడ్ హెల్దీ | Mera Healthy Food | Sakshi
Sakshi News home page

మేరా ఫుడ్ హెల్దీ

Apr 26 2015 3:07 AM | Updated on Sep 3 2017 12:52 AM

మేరా ఫుడ్ హెల్దీ

మేరా ఫుడ్ హెల్దీ

బరువు తగ్గడం కోసం.. తిండి మానేయడం, ఎక్సర్‌సెజైస్ చేయడం, ఫిట్‌నెస్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం..

బరువు తగ్గడం కోసం.. తిండి మానేయడం, ఎక్సర్‌సెజైస్ చేయడం, ఫిట్‌నెస్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం.. లావుగా ఉన్నవారు పడని పాట్లు ఉండవు. అయితే వ్యాయామంతో పాటు కొద్దిగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే బరువు తగ్గించుకోవడమే కాదు.. జబ్బులను దూరం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వెయిట్‌లాస్‌కి పచ్చి కూరగాయలు, ఆకు కూరల జ్యూస్‌లు బాగా పనిచేస్తాయి. ఎవరో కాదు... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఇది. టాక్సిన్స్ తగ్గించడం, గ్లూకోజ్  లెవెల్స్ పెంచడంలో పచ్చి కూరగాయలు, ఉడకబెట్టిన కూరగాయలను పోల్చి చూసిన వారు ఆసక్తికర విషయాలు చెప్పాలు.

వండిన ఆహారం... మృదువుగా తయారవుతుంది. సులభంగా జీర్ణమైపోతుంది కూడా. సో వండిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణమవ్వడానికి పేగులు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. సులభంగా జీర్ణమైపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటాం. ఈ ఎక్కువ కేలరీస్‌కి.. మన జీవన విధానం తోడవ్వడంతో బరువు పెరిగిపోతారు. పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల జీర్ణమవ్వడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. జీర్ణమయ్యేందుకు కూడా ఎక్కువ శక్తి అవసరమవుతుంది. మంచి ఎనర్జీనిస్తాయి. అందుకే భోజనానికి ముందు వీటిని తీసుకోవడం వల్ల శక్తితోపాటు బరువు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు ఒబెసిటీ, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుందట. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే తీసుకునే కూరగాయలు సంప్రదాయ పద్ధతిలో స్థానికంగా పండించినవైతే మరీ మంచిదని సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement