బరువులెత్తగలనే!

Disha Patani lifts 75 Kg weights - Sakshi

బరువులెత్తగలవా.. ఓ నారీ బరువులెత్తగలవా? అంటే.. బరువులెత్తగలనే అంటారు దిశా పటానీ. ఏంటీ.. ‘చెట్టులెక్కగలవా.. ఓ నరహరి..’ పాట గుర్తొస్తోందా? ఆ పాట గురించి పక్కన పెట్టి, దిశా గురించి చెప్పుకుందాం. ఈ బాలీవుడ్‌ బ్యూటీకి ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ ఎక్కువ. ఆమె సోషల్‌ మీడియాలో దాదాపు అన్నీ ఫిట్‌నెస్‌ పోస్ట్‌లే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఎక్కువ బరువులు మోస్తూ ఎప్పటికప్పుడు తన రికార్డ్‌ను తానే దాటేస్తుంటారు. తాజాగా 75 కేజీల బరువును ఎత్తారామె. ఆ వీడియోను పంచుకుంటూ, ఇదంతా నాకు ‘జస్ట్‌ పీస్‌ ఆఫ్‌ కేక్‌’ (ఇవన్నీ నాకు కేక్‌ వాక్‌ లాంటివి అనే ఉద్దేశంలో) అన్నారామె. ఇటీవలే సల్మాన్‌ ఖాన్‌తో ‘రాధే’ సినిమాలో నటించారు. ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు దిశా పటానీ. ప్రస్తుతం ‘కేటీనా’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top