బాలీవుడ్ నటి పూజా బాత్రా తన గ్లామర్‌తో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తన అందం అభినయంతో కుర్రాళ్ల మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ..నాలుగు పదుల వయసు దాటినా..ఇంకా అంతే అందం, ఫిట్‌నెస్‌తో అలరించడమే కాదు. ఇప్పటకీ ఆమెకు అంతే క్రేజ్ ఉంది. పూజ అంతలా ఫిట్‌గా యంగ్ లుక్‌లో కనిపించడానికి గల సీక్రెట్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా బయటపెట్టింది. మరి అవేంటో చూద్దామా..!.
ఈ నెల అక్టోబర్ 27తో 49 ఏళ్లు నిండాయి. అయినా ఇప్పటికీ అంతే అందంగా గ్లామర్‌గా కనిపిస్తుంది పూజ బాత్రా. అందుకోసం ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానని అంటోందామె. అంతేగాదు ఫిట్‌నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అని అంటోందామె. మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మాననసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం అనే దానిపైనే మన లుక్ ఆధారపడి ఉంటుందని పూజా నొక్కి చెబుతోంది.
మానసికంగా స్ట్రాంగ్ ఉండటమే అసలైన గేమ్ ఛేంజర్ అని అంటోంది. తాను ఆరేళ్లుగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానని, వారానికి మూడు రోజులు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. పైగా దాంట్లో తాను రెండు బ్రౌన్ బెల్ట్‌లు గెలుచుకున్నట్లు కూడా వెల్లడించిందామె. ఇది తనను చురుకుగా ఉండేలా చేసి, బరువుని నిర్వహించడం సులభమయ్యేలా చేస్తుందని చెబుతోంది.
అన్నిట్లకంటే సంతోషంగా ఉండేందుకు ఫిట్‌నెస్ అనేది అందరికి అవసరం అని పూజా పేర్కొంది. అంతేగాదు ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హైకింగ్ కూడా చేసినట్లు తెలిపింది. హైకింగ్ పరంగా మౌంట్ ఎవరెస్ట్, మోంట్ బ్లాంక్,యోస్మైట్ బేస్ క్యాంప్‌లతో సహా పలు ఎత్తైన ప్రదేశాలను చుట్టొచ్చారామె.
లండన్‌లోని లాస్ ఏంజిల్స్‌లో ఉండే పూజా యోగా టీచర్ కూడా. మార్షల్ ఆర్ట్స్‌తోపాటు యోగా అంటే కూడా మహా ఇష్టమని పూజ చెప్పుకొచ్చింది. ఇది సమతుల్య జీవితాన్ని గడపడానికి హెల్ప్ అవుతుందని అంటోంది. చివరగా ఆమె మానవవులు అభివృద్ధి చెందాలంటే సత్వ అనే సంస్కృపదానికి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. అంటే సమతుల్యత అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతలా హాయిగా జీవితాన్ని గడిపేలా అవకాశం లభిస్తుందని అంటోంది పూజా బాత్రా.


