ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా పర్లాకిమిడి కరణం వీధికి చెందిన స్వగతికా పాణిగ్రాహి మిస్ ఆసియా వరల్డ్ అందాల పోటీలలో గోల్డు విన్నర్‌గా గెలుపొంది ఒడిశా రాష్ట్రానికే వన్నె తెచ్చింది. స్థానిక చిత్రకార వీధికి చెందిన భాస్కర్ పాణిగ్రాహి కుమార్తె స్వగతికా పాణిగ్రాహి జూల్నై 31న ముంబైలో జరిగిన థాయిలాండ్ గ్రాండ్ ఫినాలే అందాల పోటీలలో ఒడిశా నుంచి పాల్గొన్నారు.
ఈ పోటీలలో మిస్ ఆసియా వరల్డ్ గోల్డు విన్నర్‌గా ఫైనల్‌లో నిలిచింది. ఈ మేరకు స్వగతికా పాణిగ్రాహికి బాలివుడ్ ఐకానిక్ సురేందర్ పాల్‌సింగ్ చేతులమీదుగా గోల్డు విన్నర్ ఆవార్డును అందుకున్నది. రూర్కీ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ పూర్తి చేసిన స్వగతికా పాణిగ్రాహి ప్రస్తుతం ఒక మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీలో అసోసియేట్ టెక్కికల్ మేనేజర్‌గా ఉద్యోగానికి ఎంపికైనది.
2025లో మిస్‌ఇండియా ప్రైడ్ ఆఫ్ నేషన్ అందాల పోటీలలో పాల్గొని గుడ్‌విత్ అంబాసిడర్‌గా నిలిచింది. తన విజయానికి కారణం ఆత్మవిశ్వాసం అని, అందాల పోటీలలో పాల్గొనడానికి ఇటీవల మరణించిన తన పిన్నిగారు కారణమని తెలియజేశారు. స్వగతికా పాణిగ్రాహి ప్రతిభపై పర్లాకిమిడి పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు.
(చదవండి: తొలి అంధ, చెవిటి వైద్యురాలు.. చికిత్స ఎలా చేస్తారంటే?)


