breaking news
beauty pegant
-
Reita Faria: తొలి అందాల డాక్టర్ రీటా ఫారియా
రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్ కూడా! అంతేకాదు మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్! ఇన్ని ఫస్ట్‌లను ప్రీఫిక్స్గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ! ఇప్పుడామెకు 82 ఏళ్లు. ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ వెల్‌ను పెళ్లి చేసుకుని ఐర్లండ్‌లో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లూ డాక్టర్లే, అమ్మలాగే వాళ్లూ స్పోర్ట్స్ పర్సన్సే గోల్ఫ్‌లో! రీటా 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండటం వల్ల స్కూల్లో, కాలేజీలో ఆమెను ‘మమ్మీ లాంగ్ లెగ్స్’ అంటూ ఆటపట్టించేవాళ్లట. అయితే ఆమె దాన్ని అవకాశంగా మలచుకుంది. పొడుగు కాళ్లతో స్పోర్ట్స్‌లో బాగా రాణించవచ్చని గ్రహించి.. త్రోబాల్, నెట్‌బాల్, బాడ్మింటన్ నుంచి హాకీ దాకా అన్ని ఆటలూ ఆడారు. పెయింటింగ్ వేస్తారు. డాక్టర్ అయ్యి.. మంచి ఫిజీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. అసలు మిస్ వరల్డ్ కోసం ప్రయాణం... రీటా ఫారియా స్వస్థలం ముంబై. తాతల కాలంలోనే గోవా నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఓ సామాన్య కుటుంబం. నాన్న.. జాన్, ఒక మినరల్ ఫ్యాక్టరీలో పనిచేస్తే.. అమ్మ.. ఆంటోయినెట్, బ్యూటీ పార్లర్ నడిపేవారు. రీటా అక్క ఫిలోమెనా. రీటా మిస్ వరల్డ్ దాకా వెళ్లడానికి ప్రోత్సహించింది ఆమే! రీటా మెడిసిన్ ఫైనలియర్లో ఉన్నప్పుడే (1966) మిస్ బాంబే పోటీల్లో పాల్గొంది. టైటిల్ సొంతం చేసుకుంది. తర్వాత వాళ్ల సోదరి ‘మిస్ ఇండియా కోసమూ పోటీ పడు’ అంటూ వెన్ను తటింది. అక్కడా టైటిల్ ఆమెనే వరించింది. తర్వాత మిస్ వరల్డ్ వైపూ తోసింది. ఇంచక్కా వేరే దేశం చూడొచ్చన్న ఆశతో తన 23వ ఏట, చేతిలో కేవలం పది పౌండ్ల (అప్పుడు మన దేశ ఫారెక్స్ నిబంధనలు కఠినంగా ఉండేవి అందుకే పది పండ్లు)తో ఆ ΄ోటీల కోసం ఫ్లయిట్ ఎక్కారు. మిస్ వరల్డ్ పాజెంట్ కోసం కూతురు ఒంటరిగా లండన్ వెళ్లడం వాళ్లమ్మను కలవరపరచింది. ఆమె తిరిగొచ్చే వరకూ ఆందోళనతోనే ఉన్నారట. మినిస్టర్ కూతురు చీర.. సేల్స్‌లో హీల్స్.. మిస్ట్ వరల్డ్ పోటీల మీద సరైన అవగాహన, పోటీల్లో ఈవినింగ్ వేర్, గౌన్, పర్సనాలిటీ చాలెంజ్, మిస్ వరల్డ్ నైట్.. లాంటి ముఖ్యమైన ఘట్టాలకు సూట్ అయే దుస్తులూ లేకుండానే పీల్గొంది రీటా. ఈవెనింగ్ వేర్లో చీరే కట్టుకోవాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే తన దగ్గర చీర మాత్రమే ఉంది. చీరను ఇండియన్ ట్రెడిషనల్ వేర్‌గానూ ప్రెజెంట్ చేయొచ్చు అనుకుంది. ఆ చీర కూడా అప్పటి మిస్ ఇండియా ఏజెంట్ ఆర్గనైజేషన్‌తో అనుబంధం ఉన్న మహారాష్ట్ర నాటి మినిస్టర్ పాజ్పేయి కూతురి పెళ్లి చీర. నగలు కూడా అరువు తీసుకున్నవే! ఆర్గనైజర్స్ ఆమె వార్డ్ రోబ్ చూసి అవాక్కయ్యారట. ఏమీ లేకుండా ఎలా పాల్గొనబోతోందీ అమ్మాయి అని! ఆమె పొడగరి కావడం వల్ల ఆమెకిచ్చిన స్విమ్ సూట్ కురచదైపోయిందట. తన దగ్గరున్న హీల్స్ ఆ పోటీలకు కావల్సిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తున్నవి. ఏం చేయాలో పాలుపోక.. ఒకరోజు తన దగ్గరున్న పది పౌండ్లతో ఎక్కడ దొరుకుతాయో వెదుక్కోసాగింది. అదృష్టవశాత్తు ఒక షాపులో మూడు డ్లకు మంచి స్విమ్ సూట్, అర పౌండ్‌కి కావల్సిన హీల్స్ దొరికాయి ఆమెకు. వాటితోనే పోటీలకు తలపడింది. విశేషమేమంటే ఆ రౌండ్లో ఆమెకు ‘బెస్ట్ స్విమ్‌సూట్’ సబ్ టైటిల్ దక్కింది. అంతేకాదు ఈవెనింగ్ వేర్ ఈవెంట్లో శారీతో ప్రత్యక్షమై ‘బెస్ట్ ఈవెనింగ్ వేర్’ సబ్ టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఫైనల్ ఈవెంట్లో కూడా జడ్జెస్ అడిగిన ప్రశ్నలుకు చక్కటి సమాధానంతో 51 కంటెస్టెంట్లతో పోటీపడి ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని అందుకుంది. ఇక వాళ్లమ్మ సంతోషానికి అవధుల్లేవట! ‘అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. కిరీటం గెలుచుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. నాకున్న అరకొర ఏర్పాట్లతో దీన్నెలా సాధించగలిగానా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పటివాళ్లలాగా అప్పట్లో ఏడాది ముందు నుంచే ప్రిపరేషన్లు ఉండేవి కావు. ఇప్పటి వాళ్లు స్పష్టమైన లక్ష్యంతో దానికోసం ట్రైన్ అవుతున్నారు’ అని చెబుతారు రీటా ఫారియా పావెల్. గెలిచాక.. రీటా ఫారియాకు మోడలింగ్‌లో, సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే వాటన్నిటికీ నో చెప్పారు. అంతేకాదు మిస్ట్ వరల్డ్‌గా వేదికల మీద పర్సనల్ అపియరెన్స్ ఇచ్చానే తప్ప ఎలాంటి కమర్షియల్స్‌కి అడ్వర్టయిజ్ చేయలేదు. ఆమె కమిట్మెంట్కు ముచ్చటపడ్డ లండన్‌లోని ప్రిస్టేజియస్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బంది తమ కాలేజీలో చదువు కొనసాగించమని ఆహ్వానించారు. అక్కడే డాక్టర్ యురోపియన్ డేవిడ్ పావెల్ ఈ డస్కీ బ్యూటీ రిటాను కలుసుకున్నాడు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు అయిదురుగు మనవలు, మనవరాళ్లు. ఇప్పటికీ రీటా అంతే బిజీగా, అంతే ఉత్సాహంగా ఉంటారు. గోల్ఫ్ ఆడుతారు. గార్డెనింగ్ చేస్తారు. ఇంటి పనీ, వంట పనీ చేస్తారు. భార్యాభర్తలిద్దరూ క్లాసికల్ మ్యూజిక్ క్లాసెస్‌కూ వెళ్తారు.– సరస్వతి రమ(చదవండి: అందాల పోటీలకూ నియమ నిబంధనలు ఉంటాయి) -
తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..!
ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న మిస్ ఏఐ అందాల పోటీలో తొలి కిరీటాన్ని మొరాకోకు చెందిన కెంజా లైలీ అనే ఇన్ఫ్లుయెన్సర్ గెలుచుకుంది. ఆమె కృత్రిమ మేథస్సు పరంగా అగ్ర స్థానంలో నిలిచింది. ఆమె ఈ ఏఐ అందాల పోటీల్లో సుమారు 1500 ఏఐ మోడళ్లను వెనక్కినెట్టి మరీ ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అందుకుగానూ ఆమెను సృష్టించిన మెరియం బెస్సా రూ. 16 లక్షల ప్రైజ్‌మనీ గెలుపొందింది. లైలీకి ఇన్‌స్టాగ్రాంలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఆహరం, సంస్కృతి, ఫ్యాషన్, అందరం, ట్రావెల్స్ వంటి వాటి గురించి కంటెట్ ఇస్తుంది. ఈ వర్చువల్ పాత్రలో కెంజా లేలీ మొరాకో గొప్ప వారసత్వాన్ని చాటుకుంది. ఆమె సంస్కృతి, సాంకేతికల ప్రత్యేక కలియికను కలిగి ఉంది. ఏడు వేర్వేరు భాషల్లో ఫాలోవలర్లతో 24/7 టచ్‌లో ఉంటంది. ఈ మేరకు వర్చవల్ ఏఐ మోడల్ మాట్లాడతూ..తన ఆశయం మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శంచడమేనని అంటోంది. అలాగే తన ఫాలోవర్లకు బహుళ రంగాల్లో అదనపు సమాచారం అందించడం అని చెప్పింది. అంతేగాదు పర్యావరణాన్ని రక్షించడానికి సానుకూలమైన రోబోట్ సంస్కృతి గురించి అవగాహన పెంచుకుంటానని అన్నారు. ఏఐ అనేది మానవ సామర్థ్యాలను భర్తీ చేసేందుకు రూపొందించిన సాధనమే గానీ అన్నింటిని ఇది భర్తీ చేయలేదు. మానవులు, ఏఐ సాంకేతకత మధ్య అంగీకారం, సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపింది. మన సమాజంలో ఏఐ సంబంధించిన మరింత సమాచారం పొందగలమనే ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పడమేనని అంటోంది. తాను మొరాకో కోసం ఈ అవార్డును గెలుచుకున్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని లైలీ చెప్పుకొచ్చింది. అలాగే సదరు ఏఐ మోడల్ లైలీని సృష్టించిన బెస్సా మాట్లాడుతూ..మొరాకోకు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప అవకాశం. సాంకేతిక రంగంలో మొరాకో, అరబ్, ఆఫ్రికన్ ముస్లిం మహిళలను హైలైట్ చేయడంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ కెంజా లైలీ మహిళా సాధికారత , సోదరిత్వం తదితరాలు తనకు నచ్చిన విషయాలని చెప్పారు. ఈ పోటీల్లో ఫ్రాన్స్‌కు చెందిన లాలినా వాలినా రెండోస్థానంలో నిలవగా, రోబోటిక్ ప్రపంచాలను సామరస్యంగా తీసుకురావాలనుకునే పోర్చుగీస్ ట్రావెలర్ ఒలివియా సీ మూడో స్థానంలో నిలిచింది. ఇది ఏఐ క్రియేటర్ల విజయాలను జరుపుకోవడానికి భవిష్యత్తులో ఏఐ క్రియేటర్ల స్టార్డ్స్ పెరిగేలా చేసే ఒక అద్భుతమైన వేదిక. View this post on Instagram A post shared by Kenza Layli • كنزة ليلي (@kenza.layli) (చదవండి: Anant Ambani Haldi Ceremony: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్రధారణలో నీతా..!) -
Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే..
Miss Universe Beauty Pageant Rules: ‘స్వీయ–వ్యక్తీకరణకు వేదిక’ అంటూ తన గురించి ఘనంగా పరిచయం చేసుకుంటుంది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (ఎంయూఓ). అయితే స్వీయ–వ్యక్తీకరణకు ఆర్గనైజేషన్ రూల్‌బుక్‌లో కొన్ని నిబంధనలు అడ్డుపడుతున్నాయని, పరిమితులు విధిస్తున్నాయనే విమర్శ ఉంది. మొన్నటి వరకు– ‘ఆ నిబంధనలు అంతే. అప్పుడూ ఉన్నాయి. ఎప్పుడూ ఉంటాయి’ అన్నట్లుగా వ్యవహరించిన ఆర్గనైజేషన్ ఒక చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది... అప్పటి వరకు సింగిల్‌గానే ఉండాలి! మిస్ యూనివర్స్ 2023 పోటీలో వివాహితులు, మాతృమూర్తులు కూడా నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. నిబంధనను సవరించడానికి శ్రీకారం చుట్టడం ద్వారా విప్లవాత్మకమైన, చారిత్రాత్మక మార్పు దిశగా అడుగు వేసింది ఎంయూవో. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం విశ్వసుందరి పోటీల్లో వివాహితులు, మాతృమూర్తులు పాల్గొనడానికి అనర్హులు. టైటిల్ దక్కించుకున్నవారు కొత్త విజేత ఆగమనం వరకు సింగిల్‌గానే ఉండాలి. మార్పు మంచిదే! ‘ఎంయూవో’లో వచ్చిన మార్పుపై తన సంతోషాన్ని వ్యక్తపరిచింది ఆండ్రియా మెజా. మెక్సికోకు చెందిన ఆండ్రియా ‘మిస్ యూనివర్స్ 2020’ కిరీటాన్ని దక్కించుకున్న విజేత. ‘సమాజంలో రోజురోజూకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. అవి ఆయా రంగాలలోప్రతిఫలిస్తున్నాయి. మహిళలు నాయకత్వ స్థానాల్లోకి వెళుతున్నారు. తమను తాము నిరూపించుకుంటున్నారు. మార్పు అన్ని రంగాలలోనూ రావాలి. దీని ప్రకారం చూసినప్పుడు మిస్ యూనివర్స్ పోటీలో వివాహితులు, తల్లులకు ప్రవేశం కల్పించడం అనేది ఆహ్వానించదగిన, హర్షించాల్సిన మార్పు. అయితే ఈ నిర్ణయం కొద్దిమందికి రుచించక పోవచ్చు. దీనికి కారణం వారి వ్యక్తిగత స్వార్థం తప్ప మరేదీ కాదు. ప్రస్తుత మార్గదర్శకాలలో అవాస్తవికత కనిపిస్తుంది. పెళ్లి, మాతృత్వంలాంటి వ్యక్తిగత నిర్ణయాలు వారి ప్రతిభకు అడ్డంకి కావడం అనేది సమర్థనీయం కాదు. ఇరవై ఏళ్లకే పెళ్లై పిల్లలు ఉన్నవారు ఉన్నారు. వారిలో ఎంతోమందికి మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలనే కల ఉండవచ్చు. నిబంధనల వల్ల తమ కలను సాకారం చేసుకునే అవకాశం దక్కి ఉండకపోవచ్చు. తాజా మార్పు వల్ల ఇలాంటి మహిళల జీవితాల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది’ అంటుంది ఆండ్రియా మెజా. రూల్ అంటే రూలే అనుకునే రోజులకు కాలం చెల్లింది! ‘ఇది మొదటి అడుగు. ఇంకా ఎన్నో అడుగులు పడాలి’ అంటుంది బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త అక్షర. విడాకులు తీసుకున్నవారు, అబార్షన్ చేయించుకున్నవారు పోటీలో పాల్గొనడానికి అనర్హులు అనేది ఒకప్పుడు ‘మిస్ అమెరికా’ నిబంధనలలో ఉండేది. మోడల్ వెరోనిక 2018లో ‘మిస్ ఉక్రెయిన్’ టైటిల్‌ను గెల్చుకుంది. అయితే ఆమె అయిదు సంవత్సరాల పిల్లాడికి తల్లి అని ఆలస్యంగా తెలుసుకున్న ఆర్గనైజేషన్ ఆ టైటిల్‌ను వెనక్కి తీసుకుంది. టైటిల్‌ను వెనక్కి తీసుకోవడంపై మండిపడడమే కాదు న్యాయపోరాటానికి కూడా సిద్ధపడింది వెరోనిక. ‘రూల్ అంటే రూలే అనుకునే రోజులకు కాలం చెల్లింది. కాలంతోపాటు అవి మారితేనే కాలానికి నిలబడతాయి’ అంటుంది జైపూర్‌కు చెందిన శాన్వి. అంతబాగానే ఉంది.. కానీ! తాజాగా 70 వసంతాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించింది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్. ఇది డిజిటల్ సంచిక. ‘175, 000 పేపర్ పేజీల అవసరం లేకుండా ఈ డిజిటల్ సంచిక తీసుకువచ్చాం’ అంటుంది ఆర్గనైజేషన్ పర్యావరణహిత స్వరంతో. ఇది బాగానే ఉందిగానీ, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌లోని నిబంధనలు, భావజాలానికి సంబంధించి(వర్ణం, ఒడ్డూపొడుగు...ఇలాంటివి మాత్రమే అందానికి నిర్వచనాలా!) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శిబిరాల నుంచి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. చెవివొగ్గి, వాటిని సానుకూలంగా అర్థం చేసుకొని ముందుకు కదిలితే సంస్థకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించడానికి అట్టే కాలం పట్టదు. చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
అందగత్తెలంతా ఒక్కచోట చేరారు
లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టైం పాస్ కోసం ఎక్కువ సమయం ఇంటర్నెట్లోనే గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడ ఏదో ఒక చాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది కదా. తాజాగా ‘థ్రోబ్యాక్’ చాలెంజ్ నడుస్తోంది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్‌తో వర్తమానం గందరగోళం అయ్యింది.. భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తోస్తుంది. మరి గతం.. చేదు,తీపి జ్ఞాపకాలతో నిండి ఉంటుంది కదా. అందుకే ఈ థ్రోబ్యాక్ చాలెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది. గతించిన కాలానికి చెందిన ఎన్నో అద్భుతమైన, అందమైన, విలువైన జ్ఞాపకాలు మరో సారి తెర మీదకు వస్తున్నాయి.(రెండు నెలల తర్వాత బయటకు..) ఈ క్రమంలో ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారతీయ అందానికి ప్రతికలుగా నిలిచిన అందాల రాణులంతా ఓ చోట చేరిన ఈ చిత్రం నెటిజనుల మనసు దోచుకుంది. ఈ ఫోటోలో సుస్మితా సేన్(మిస్ యూనివర్స్ 1994), ఐశ్వర్య రాయ్(మిస్ వరల్డ్ 1994), డయానా హేడెన్(మిస్ వరల్డ్ 1997 ), యుక్తా ముఖి(మిస్ వరల్డ్ 1999), లారా దత్తా(మిస్ యూనివర్స్ 2000), ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్ 2000), దియా మీర్జా(మిస్ ఆసియా పసిఫిక్ 2000) ఈ ఫోటోలో ఉన్నారు. చరిత్ర సృష్టించిన మహిళల చిత్రాన్ని మరో సారి తెర మీదకు తెచ్చినందుకు నెటిజనులు కృతజ్ఞతలు తెలిపుతున్నారు.(‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’) View this post on Instagram 👑 A bevy of beauties! From left to right: Sushmita Sen - Miss Universe 1994 Priyanka Chopra - Miss World 2000 Lara Dutta - Miss Universe 2000 Yukta Mookey - Miss World 1999 Dia Mirza - Miss Asia Pacific 2000 Diana Hayden - Miss World 1997 Aishwarya Rai - Miss World 1994 @sushmitasen47 @priyankachopra @larabhupathi @yuktamookhey @diamirzaofficial @dianahaydensays @aishwaryaraibachchan_arb #missasiapacific #missworld #missuniverse #missindia #missfeminaindia #femina #beautypageant #beautyqueen #beautyqueens #laradutta #laraduttabhupathi #diamirza #diamirzaofficial #priyankachopra #priyankachoprajonas #priyankachoprafans #priyankachopra_nour #priyankachoprateam #aishwaryarai #aishwaryaraibachan #aishwarya #aish #aishwaryaraibachchan #sushmitasen #sushmitasenfanclub #sushmitasen47 #yuktamookhey #dianahayden #missworld1994 #missuniverse1994 A post shared by @ retrobollywood on May 13, 2020 at 12:00am PDT -
‘నేను అందమైన అదృష్టవంతురాలిని’
సాక్షి, న్యూఢిల్లీ : భర్త సహోద్యోగి, ఆర్మీ మేజర్ నిఖిల్ హండా చేతిలో దారుణ హత్యకు గురైన శైలజ ద్వివేది 2017లో మిసెస్ ఇండియా ఎర్త్ పోటిల్లో అమృత్సర్ తరుపున పాల్గొంది. పోటిల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. తన మనసుకు నచ్చినట్లే తన జీవితాన్ని గడుపుతాను అని చెప్పేంత తెగువ గల మహిళ శైలజ ద్వివేది. గత సంవత్సరం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి, తన కుటుంబం గురించే కాక మన దేశంలో మహిళల భద్రత ఎలా ఉంది వంటి పలు అంశాల గురించి తన అభిప్రాయలను తెలియజేశారు. శైలజ ద్వివేది అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ‘‘చిన్నప్పటి నుంచి నా దేశం తరపున ఏదో ఒక పోటీలో పాల్గొనాలనే కోరిక నాలో చాలా బలంగా ఉండేది. రోజువారి జీవితంలో మహిళలు కుటుంబం కోసమే తప్ప తమ కోసం తాము జీవించటం లేదు. ఇక్కడ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడవారికి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికంటూ కొన్ని కలలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. కుటుంబంతో పాటు వాటిని కూడా నెరవేర్చుకోవాలి. నా మనసుకు నచ్చి నేను ఈ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్నాను తప్ప నేనేంటో తెలియజేయాలనో, ఇంకేదో సాధించాలనే ఉద్దేశంతో మాత్రం కాదు’ కుటుంబం అంటే ఇలా ఉండాలి... ప్రేమించే భర్త, అల్లరి చేసే పిల్లలు వారి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవాలతో కూడిన ఒక అనుబంధం ఉంటే అదే అసలు సిసలు కుటుంబం. అటువంటి కుటుంబంలోని వారంతా కలిసి పనిచేసుకుంటూ, తమ అభిప్రాయలను ఒకరితో ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉంటారు. అటువంటి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అందమైన వ్యక్తినే నేను వివాహం చేసుకున్నాను మహిళల భద్రత... మహిళల భద్రత పట్ల మన దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో పాటు మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, వేధింపులు, యాసిడ్ దాడులు, గృహహింస వేధింపులు చూస్తుంటే మనం ఇంతటి భయంకర సమాజంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. ఖాళీ సమయాల్లో హిందీ సినిమాలు చూడ్డటం, పాటలు వినటం తనకు ఇష్టం. బాగా కబుర్లు చెప్పెవారంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందం, అదృష్టం కలిసిన అమ్మాయిని నేను’’. చదువులోనూ చురుకే... అందం మాత్రమే కాక చదువులోనూ ముందే ఉండేవారు శైలజ. ఒక్కసారి ఆమె విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే ట్రావేల్ అండ్ టూరిజమ్‌లో డిగ్రీ, ఆర్బన్ ప్లానింగ్‌లో ఎంటెక్, జియోగ్రఫీలో మాస్టర్స్ చేశారు. అంటే సాంప్రదాయ బద్దంగా డిగ్రీలో తీసుకున్న సబెక్ట్నే పీజీలో చదవకుండా నూతన అంశాలను ఎంచుకుంటూ కొత్తదనం అంటే ఎంత ఇష్టమే చెప్పకనే చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారన్న అక్కసుతో ఆమెను నిఖిల్ హండా అతి దారుణంగా గొంతు కోసి మరి చంపాడు. -
లైంగిక ఆరోపణలు.. అందాల పోటీలకు బ్రేక్
కారకాస్ : లైంగిక ఆరోపణల నేపథ్యంలో వెనెజులా అందాల పోటీలకు బ్రేక్ పడింది. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులకు పడక సుఖానికి అందించి కొందరు పోటీదారులు పెద్ద ఎత్తున్న డబ్బు తీసుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోటీలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వెనిజులాలో గత 40 ఏళ్లుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దఫా పోటీల్లో న్యాయనిర్ణేతలు, నిర్వాహకులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ పోటీదారులు ఆరోపణలకు దిగారు. వెంటనే తెరపైకి వచ్చిన మాజీ పోటీదారులు... గతంలోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగాయని ఆరోపించారు. నిర్వాహకులతోపాటు బడా వేత్తలకు లైంగిక సుఖాన్ని అందించారని, తద్వారా డబ్బుతోపాటు కొందరు కిరీటాన్ని కూడా కైవసం చేసుకున్నారంటూ బాంబు పేల్చారు. ఈ ఆరోపణలు కాస్త తారా స్థాయికి చేరటంతో ఆన్లైన్లో పెద్ద ఉద్యమమే నడిచింది. దిగొచ్చిన నిర్వాహకులు కారాకస్‌లోని వేదికను మూసేస్తూ ఆడిషన్స్‌ను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్రకటించారు. ఈ ఆరోపణలపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, వెనెజులా ఇప్పటిదాకా ఏడు మిస్ యూనివర్స్, ఆరు మిస్ వరల్డ్ టైటిళ్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!
అందాలపోటీల్లో ఎలాగైనా తన కూతురు గెలవాలన్న లక్ష్యంతో.. ఆమె సన్నబడాలని ఓ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! తట్టుకోలేని కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా... వైద్యులు ఆమెకు పరీక్షలు చేస్తే ఈ విషయం తేలింది. తొలుత ఆమె గర్భవతేమోనని అక్కడి నర్సులు భావించారు. కానీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తే గర్భవతి కాదని, పేగులు బాగా వాచి ఉన్నాయని తెలిసింది. ఆమెకు మందులు వేసి టాయిలెట్‌కు తీసుకెళ్తే అక్కడ మొత్తం ఏలికపాములే బయటకు వచ్చాయి. అప్పుడు ఆమె కడుపునొప్పికి అసలు కారణం తెలిసింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఆమె కడుపులో చాలా ఎక్కువ సంఖ్యలో ఏలికపాములు ఉన్నాయని యువతికి చికిత్స చేసిన నర్సు మారికర్ కాబ్రాల్ ఓసోరియో తెలిపింది. ఆమె ఈ విషయాన్ని 'అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ద ఈఆర్' అనే టీవీ కార్యక్రమంలో చెప్పింది. ఏలికపాములు చాలా పెద్దగా ఉన్నాయని, అవి టాయిలెట్లోంచి బయటకు రావడానికి కూడా ప్రయత్నించాయని ఆ నర్సు తెలిపింది. డిస్కవరీ ఛానల్‌కు చెందిన 'ఫిట్ అండ్ హెల్త్' అనే కార్యక్రమంలో ఈ షో ప్రసారమైంది. ఆ తల్లి మెక్సికో నుంచి ఏలికపాముల గుడ్లు తీసుకొచ్చి, తన కూతురితో బలవంతంగా తినిపించినట్లు తేలింది. అందాలపోటీలలో పాల్గొనడానికి ముందు సన్నబడాలనే ఆమె ఇలా చేసిందట.