ప్రాణాలనే త్యాగం చేస్తాయి! | Cephalotes ants use their flattened heads as doors to lock down their nests | Sakshi
Sakshi News home page

ప్రాణాలనే త్యాగం చేస్తాయి!

Jun 5 2026 2:25 AM | Updated on Jun 5 2026 2:25 AM

Cephalotes ants use their flattened heads as doors to lock down their nests

సమ్మర్‌ కిడ్స్‌

నేస్తాలూ! చీమల ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో అత్యంత విచిత్రమైన చీమ‘కొలొబోప్సిస్‌’ దీన్ని సాధారణంగా డోర్‌–హెడ్‌ యాంట్‌ అని పిలుస్తారు. ఈ చీమ తల ముందు భాగం గుండ్రంగా, ఫ్లాట్‌గా ఉండి శత్రువులు తన గూట్లోకి రాకుండా ఉండటానికి, తన తలను ఆ రంధ్రానికి అడ్డు పెట్టి కూర్చుంటుంది. అందుకే ఈ చీమకు డోర్‌హెడ్‌ యాంట్‌ అని పేరు. అంతేకాదు ఈ కొలొబోప్సిస్‌ చీమల జాతిలోనే కొన్ని చీమలకు ఒక సూపర్‌ పవర్‌ ఉంటుంది.

 ఏదైనా పెద్ద శత్రువు గూటిపై దాడి చేసినప్పుడు, ఇవి తమ పొట్టను గట్టిగా బిగబట్టి బాంబులా బద్దలు కొట్టుకుంటాయి! అలా పేలినప్పుడు వాటి శరీరం నుంచి ఒక రకమైన జిగురు, విషపూరితమైన ద్రవం శత్రువులపై పడటంతో అవి ప్రమాదంలో పడటమో, చనిపోవడమో జరుగుతుంది. తన గూటిని, మిగతా చీమలను కాపాడటానికి ఇవి తమ ప్రాణాలనే త్యాగం చేస్తాయి. ఈ వింత చీమలు ఎక్కువగా ఆసియా ఖండంలోని దట్టమైన అడవులలో చెట్ల పైభాగాన జీవిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement