‘పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే విషయం చాలామంది మరిచిపోతుంటారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో నివసిస్తున్న ఐరీష్ తాత అలా కాదు. ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా అక్కడ ప్రత్యక్షమవుతాడు. జోద్‌పూర్‌లోని పురాతన చెక్కడాలు, వాస్తుశిల్పాన్ని మెచ్చుకునే సందర్శకులు ఆ చుట్టుప్రక్కల ఉన్న చెత్తకుప్పలను మాత్రం పట్టించుకునేవారు కాదు. ఇది చూసి ఐరీష్ పెద్దాయనకు బాధగా అనిపించింది. ఆ చెత్తను తానే శుభ్రం చేశాడు.
ఎనభై ఏళ్ల కారోన్ ర్యాన్స్‌లీ నగరంలోని శతాబ్దాల నాటి మెట్ల బావులను శుభ్రం చేస్తూ పునరుద్ధరిస్తున్నాడు. జోద్‌పూర్‌కు కారోన్ ఒక సందర్శకుడిగా వచ్చాడు. ఆ తరువాత ఆ నగర జీవులలో ఒకడయ్యాడు. నగరంలోని చారిత్రాత్మక బావులు (మెట్ల బావులు), ఝులారాలను (మెట్ల జలాశయాలు) పునరుద్ధరించడంలో ఆయనకు ఉన్న నిబద్ధత కారణంగా ఆయన ఎంతోమందికి ఇష్టుడయ్యాడు
ఇష్టం మాట ఎలా ఉన్నా ఐరిష్ తాతను అందరూ పాగల్ సాబ్’ (పిచ్చి వ్యక్తి) అని పిలుస్తారు!
‘సామాజిక స్పృహ ఉండడం అనేది పిచ్చితనం అవుతుందా!’
‘గతంలోకి వెళితే... ఎంతోమంది మహానుభావులను ప్రజలు పిచ్చివాళ్లుగానే చూశారు’ ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి.


