breaking news
Caron
-
మంచి పని చేస్తే... పాగల్ సాబ్ అంటున్నారు!
‘పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే విషయం చాలామంది మరిచిపోతుంటారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో నివసిస్తున్న ఐరీష్ తాత అలా కాదు. ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా అక్కడ ప్రత్యక్షమవుతాడు. జోద్‌పూర్‌లోని పురాతన చెక్కడాలు, వాస్తుశిల్పాన్ని మెచ్చుకునే సందర్శకులు ఆ చుట్టుప్రక్కల ఉన్న చెత్తకుప్పలను మాత్రం పట్టించుకునేవారు కాదు. ఇది చూసి ఐరీష్ పెద్దాయనకు బాధగా అనిపించింది. ఆ చెత్తను తానే శుభ్రం చేశాడు.ఎనభై ఏళ్ల కారోన్ ర్యాన్స్లీ నగరంలోని శతాబ్దాల నాటి మెట్ల బావులను శుభ్రం చేస్తూ పునరుద్ధరిస్తున్నాడు. జోద్‌పూర్‌కు కారోన్ ఒక సందర్శకుడిగా వచ్చాడు. ఆ తరువాత ఆ నగర జీవులలో ఒకడయ్యాడు. నగరంలోని చారిత్రాత్మక బావులు (మెట్ల బావులు), ఝులారాలను (మెట్ల జలాశయాలు) పునరుద్ధరించడంలో ఆయనకు ఉన్న నిబద్ధత కారణంగా ఆయన ఎంతోమందికి ఇష్టుడయ్యాడుఇష్టం మాట ఎలా ఉన్నా ఐరిష్ తాతను అందరూ పాగల్ సాబ్’ (పిచ్చి వ్యక్తి) అని పిలుస్తారు!‘సామాజిక స్పృహ ఉండడం అనేది పిచ్చితనం అవుతుందా!’‘గతంలోకి వెళితే... ఎంతోమంది మహానుభావులను ప్రజలు పిచ్చివాళ్లుగానే చూశారు’ ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. -
ప్లూటోపై రంగులు!
వాషింగ్టన్: ప్లూటోతోపాటు దాని ఉపగ్రహం చరోన్‌పై వివిధ రంగులతో కూడిన వలయాలున్నట్లు నాసా గుర్తించింది. ‘ప్లూటో టైమ్’ పేరుతో సామాజిక మాధ్యమంలో నాసా నడిపిన ఉద్యమానికి 7 వేల మంది తాము సేకరించిన చిత్రాలను పంపించారు. వీటన్నింటినీ ఒకచోట చేర్చిన నాసా.. అసలు చిత్రాలను, ప్లూటోపై ఉన్న రంగుల వలయాలు, ఇందుకు కారణాలను వివరించింది. ప్లూటో గ్రహం సూర్యునికి చాలా దూరంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మధ్యాహ్నం పడే సూర్యరశ్మి.. ఉదయం, సాయంత్రం భూమిపై పడే సూర్యుని వెలుతురుతో సమానం. అత్యంత దూరంలో ఉన్న ప్లూటోపైకి సూర్యుని కిరణాలు చేరుకునే క్రమంలో తీవ్రతలో మార్పు కారణంగా వలయాలు కనిపిస్తున్నాయని.. సంధ్యాసమయంలో భూ వాతావరణంలోనూ అలాంటి వలయాలు కనిపిస్తాయని కొందరు పరిశోధకులు నాసాకు పంపిన సమాధానాల్లో పేర్కొన్నారు.


