భువనేశ్వర్‌లో 2028 ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ | 2028 Asian Indoor Athletics Championships in Bhubaneswar | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్‌లో 2028 ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

May 28 2026 10:30 AM | Updated on May 28 2026 10:30 AM

2028 Asian Indoor Athletics Championships in Bhubaneswar

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ విరివిగా ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న భారత్‌కు మరో రెండు అవకాశాలు దక్కాయి. 2027లో జరగనున్న ఆసియా రిలేస్, 2028లో జరగనున్న ఆసియా ఇండోర్‌ చాంపియన్‌షిప్‌నకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు ఆసియా అథెటిక్స్‌ సంఘం (ఏఏఏ) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ బుధవారం వివరాలు వెల్లడించింది.

2027 మే నెలలో ఆసియా రిలేస్‌ చండీగఢ్‌లో నిర్వహించనుండగా... 2028 జనవరిలో ఆసియా ఇండోర్‌ చాంపియన్‌షిప్‌నకు భువనేశ్వర్‌ వేదిక కానుంది. హాంకాంగ్‌లో జరిగిన ఏఏఏ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు ఈవెంట్‌లో భారత్‌లో జరగనుండటం ఇదే తొలిసారి. ఈ రెండు టోరీ్నల ఆతిథ్యం కోసం భారత్‌ గతేడాది బిడ్‌లు దాఖలు చేసింది.

‘ఇది దేశం గరి్వంచే క్షణం. రెండు పెద్ద ఈవెంట్‌లకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది’ అని వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఉపాధ్యక్షుడు అదిల్లె సుమరివాలా తెలిపారు. 2024 ఆసియా రిలేస్‌ బ్యాంకాక్‌లో జరగగా... ఈ ఏడాది చైనాలో నిర్వహించారు. ఆసియా రిలేస్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 4–100 మీటర్లు, 4–400 మీటర్లు... మహిళల 4–100 మీటర్లు, 4–400 మీటర్ల పోటీలతో పాటు... ఈ రెండు విభాగాల్లో మిక్స్‌డ్‌ పోటీలు జరుగుతాయి. ఆసియా దేశాల నుంచి 200 మందికిపైగా అథ్లెట్లు ఇందులో పాల్గొననున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement