హ్మ్‌..! చెప్పులు బయట!! పెద్దల హెచ్చరికలో పరమార్థం ఏంటంటే? | Wearing Outdoor Shoes Inside Home Can Spread Dangerous Bacteria Health Risks | Sakshi
Sakshi News home page

హ్మ్‌..! చెప్పులు బయట!! పెద్దల హెచ్చరికలో పరమార్థం ఏంటంటే?

Aug 1 2026 12:11 PM | Updated on Aug 1 2026 12:43 PM

Wearing Outdoor Shoes Inside Home Can Spread Dangerous Bacteria Health Risks

జర భద్రం

కొంతమంది బయట వాడే చెప్పులు, షూ లను ఇంట్లో కూడా వాడేస్తుంటారు. వారు ఇది పాదాల శుభ్రతకు సంబంధించిన అంశంగా భావించినప్పటికీ, ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా. ఎందుకంటే మీరు షూలను, చెప్పులను మాత్రమే ఇంటిలోకి తీసుకెళ్లరు.. వాటితో పాటుగా లక్షలాది క్రిములను, బ్యాక్టీరియాను కూడా వెంట తీసుకెళ్తుంటారు.

బూట్ల అడుగుభాగంలో ఈ.కోలై, సి.డిఫిసిల్, స్టెఫిలోకోకస్‌ వంటి ప్రమాదకర బాక్టీరియాలు అధిక మొత్తంలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇవి కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో ఇది మరింత ప్రమాదకరం. వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే కీళ్ల నొప్పులు, పాదాల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోర్‌ స్లిప్పర్స్‌ ఉపయోగించాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బయట వాడకూడదు. ఇంటిగుమ్మం వద్దే షూలను వదిలేయడం అనేది ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఒక సులభమైన అలవాటు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement