పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బ్రాడ్‌పీక్ పర్వతంపై హిమపాతం ఘటనలో కన్నుమూత
కాఠ్మండు: పర్వతారోహణలో అనితర సాధ్యమైన రికార్డ్‌లను బద్దలుకొట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మరో పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన 43 ఏళ్ల ప్రఖ్యాత బ్రిటన్– నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా గురువారం జరిగిన హిమపాతం ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పుర్జాతో కూడిన పది మంది పర్వతారోహకుల బృందం బ్రాడ్‌పీక్‌ను అధిరోహిస్తూ హిమపాతంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. శుక్రవారం నాటికే నలుగురికి మృతదేహాలను వెలికితీయగా తాజాగా మృతుల్లో పుర్జా ఉన్నట్లు స్థానిక యంత్రాంగం శనివారం ధృవీకరించింది.
రికార్డులను అధిరోహించాడు..
ఏడేళ్ల క్రితం కేవలం ఆరు నెలల వ్యవధిలో 8వేల మీటర్లకంటే ఎత్తయిన 14 పర్వతాలను అవలీలగా అధిరోహించి ఆనాడు పుర్జా సరికొత్త ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. 2021 జనవరిలో భయంకరమైన చలిలోనూ కె2 పర్వతాన్ని పుర్జా అధిరోహించారు. నాలుగేళ్ల క్రితం కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన తొలి మూడు(ఎవరెస్ట్, కె2, కాంచనగంగ)లను వేగంగా అధిరోహించి సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పారు. ఈ ఫీట్‌ను ఆయన కేవలం 76 రోజుల్లో పూర్తిచేయడం విశేషం. తండ్రి, సోదరుల్లా తానూ బ్రిటిష్ సైన్యంలో పనిచేయాలని టీనేజీలో భావించారు. కష్టపడి బ్రిటన్ సైన్యంలో చేరి ఆరేళ్లు గూర్ఖాగా, పదేళ్లు యూకే స్పెషన్ ఫోర్సెస్‌లో పనిచేశారు.


