వినాశకర దాడులు చేస్తాం  | USA President Donald Trump issued a stern warning to the Iran | Sakshi
Sakshi News home page

వినాశకర దాడులు చేస్తాం 

Aug 2 2026 4:57 AM | Updated on Aug 2 2026 4:57 AM

USA President Donald Trump issued a stern warning to the Iran

ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్‌ 

చర్చలకు తలవంచేదాకా దారుణ దాడులు చేస్తామని పునరుద్ఘాటన

వాషింగ్టన్‌/కైరో: హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ తనదైన పట్టును నిలుపుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత చిర్రెత్తిపోతోంది. దీంతో ఇకమీదట అత్యంత విశానకర స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్‌ను ట్రంప్‌ తాజాగా హెచ్చరించారు. మేరీల్యాండ్‌లో క్యాంప్‌ డేవిడ్‌ ప్రెసిడెన్షియల్‌ రీట్రీట్‌ కార్యక్రమంలో తన కేబినెట్‌ సహచరులతో భేటీలో ట్రంప్‌ మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను బేషరతుగా ఇరాన్‌ తెరవాల్సిందే. 

మధ్యవర్తిత్వం ద్వారా చర్చల ప్రక్రియ పూర్తిగా విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ విధ్వంసకదాడుల పర్వం మొదలవుతుంది. మా దాడులను ఇరాన్‌ విజయవంతంగా అడ్డుకుంటుందని అస్సలు అనుకోను. ఎందుకంటే వాళ్ల నేవీ నాశనమైంది. గగనతల రక్షణ వ్యవస్థ నిరీ్వర్యమైంది. ఈమధ్య అమెరికా దాడుల తీవ్రతను తగ్గించడంతో వాళ్లు సాయుధ శక్తిసామర్థ్యాలపరంగా కాస్తంత పుంజుకున్నారేమో. కానీ అమెరికా దాడులను తీవ్రతరంచేయనుంది. గెలవడమే మా ధ్యేయం. ఇక దాడులను తట్టుకోలేం అని ఇరాన్‌ కాళ్లబేరానికొచ్చేస్థాయిలో దాడులు చేస్తాం’’అని ట్రంప్‌ ప్రకటించారు.  

కువైట్‌పై ఇరాన్‌ దాడులు 
అమెరికాకు మిత్రదేశంగా ఉన్న కువైట్‌పై ఇరాన్‌ శనివారం దాడులుచేసింది. అయితే ఇరాన్‌ డ్రోన్లను నేలకూల్చామని కువైట్‌ రక్షణశాఖ తెలిపింది. అత్యంతకీలకమైన ప్రాంతాలపై ఇరాన్‌ దాడులకు ప్రయతి్నంచింది. బుబియాన్‌ ద్వీపంలోని వాహన తయారీ కర్మాగారంపై దాడికి యతి్నంచింది. ఆ ప్రయత్నాలను మేం వమ్ముచేశాం’అని కువైట్‌ రక్షణశాఖ అధికార ప్రతినిధి జనరల్‌ అబ్బుల్‌అజీజ్‌ తెలిపారు. మరోవైపు ఒమన్‌లోని లీమా సమీపంలోని హార్మూజ్‌ జలసంధిలో ట్యాంకర్‌నౌకపై ఇరాన్‌ దాడిచేసిందని బ్రిటన్‌ నావికాదళం తెలిపింది. ఖాసాబ్‌ సిటీకి వాయవ్యంగా 21 నాటికల్‌ మైళ్లదూరంలో సముద్రజలాల్లో మరో సరుకు రవాణా నౌక సమీపంలో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement