రష్యా నుంచి అధునాతన అణుజలాంతర్గామి  | Russia Launches New Nuclear Submarine To Carry Doomsday Underwater Drone | Sakshi
Sakshi News home page

రష్యా నుంచి అధునాతన అణుజలాంతర్గామి 

Nov 3 2025 5:32 AM | Updated on Nov 3 2025 5:32 AM

Russia Launches New Nuclear Submarine To Carry Doomsday Underwater Drone

ఖబరోవ్‌స్క్‌ను ఆవిష్కరించిన రష్యా 

పోసెడియాన్‌ అణ్వస్త్ర డ్రోన్‌ను ప్రయోగించగల సామర్థ్యం 

మాస్కో: ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవేస్ట్‌నిక్‌ క్షిపణిని ప్రయోగించి ప్రపంచదేశాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన రష్యా ఆదివారం మరో ఆధునిక అస్త్రంతో ముందుకొచ్చింది. తీర ప్రాంత దేశాలపై భీకరస్థాయిలో దాడులు చేయగల పోసెడాన్‌ అణ్వస్త్ర డ్రోన్‌ను ప్రయోగించే సామర్థ్యమున్న ‘ఖబరోవ్‌స్క్‌’ జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. 

అత్యంత వినాశనం సృష్టించగల డ్రోన్‌ కాబట్టే పోసెడాన్‌ డ్రోన్‌ను ప్రళయకాల(డూమ్స్‌డే) క్షిపణి అని కూడా పిలుస్తారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బలౌస్క్, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ అలెగ్జాండర్‌ మోసెయేవ్‌ సమక్షంలో ఈ కొత్త జలాంతర్గామిని సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టారు. సెవెరోడ్‌విన్‌స్క్‌ నగరంలోని సేవ్‌మాష్‌ షిప్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారీగా ఉండే ఖబరోవ్‌స్క్‌ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు, రోబోటిక్‌ వ్యవస్థల మేలు కలయిగా చెప్పొచ్చు. శత్రుదేశాల నిఘా నుంచి సునాయసంగా తప్పించుకోగలదు. ఎంతో వేగంగా ప్రయాణించగలదు. జాడ తెలీకుండా మరింత లోతులకు వెళ్లి దాక్కోగలదు. శత్రువులపై వ్యూహాత్మకంగా దాడిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement