breaking news
Poseidon-8I aircraft
-
రష్యా నుంచి అధునాతన అణుజలాంతర్గామి
మాస్కో: ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవేస్ట్నిక్ క్షిపణిని ప్రయోగించి ప్రపంచదేశాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన రష్యా ఆదివారం మరో ఆధునిక అస్త్రంతో ముందుకొచ్చింది. తీర ప్రాంత దేశాలపై భీకరస్థాయిలో దాడులు చేయగల పోసెడాన్ అణ్వస్త్ర డ్రోన్‌ను ప్రయోగించే సామర్థ్యమున్న ‘ఖబరోవ్స్క్’ జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. అత్యంత వినాశనం సృష్టించగల డ్రోన్ కాబట్టే పోసెడాన్ డ్రోన్‌ను ప్రళయకాల(డూమ్స్‌డే) క్షిపణి అని కూడా పిలుస్తారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బలౌస్క్, నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మోసెయేవ్ సమక్షంలో ఈ కొత్త జలాంతర్గామిని సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టారు. సెవెరోడ్విన్స్క్ నగరంలోని సేవ్మాష్ షిప్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారీగా ఉండే ఖబరోవ్స్క్ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థల మేలు కలయిగా చెప్పొచ్చు. శత్రుదేశాల నిఘా నుంచి సునాయసంగా తప్పించుకోగలదు. ఎంతో వేగంగా ప్రయాణించగలదు. జాడ తెలీకుండా మరింత లోతులకు వెళ్లి దాక్కోగలదు. శత్రువులపై వ్యూహాత్మకంగా దాడిచేస్తుంది. -
అమెరికాతో భారత్ భారీ ఒప్పందం
న్యూఢిల్లీ: నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8ఐ’(పీ-8ఐ)లను కొనేందుకు అమెరికా రక్షణ శాఖ, విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో దీన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే ఎనిమిది పీ-8ఐలను భారత్ కొన్నదని. ఇప్పుడు మరో నాల్గింటిని కొంటోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మరో 145 తేలికపాటి ‘ఎం777’ శతఘ్నులను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది 22 ఆపాచి, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రక్షణ రంగానికి సంబంధించి తాజా ఒప్పందంతో కలిపి గత పదేళ్లలో మొత్తం 15 బిలియన్ డాలర్ల ఒప్పందాలను అమెరికాతో భారత్ కుదుర్చుకుంది.


