డిసెంబర్‌లో పుతిన్ పర్యటన సందర్భంగా ఒప్పందం
మాస్కో: ఉక్రెయిన్‌తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అర్హత కలిగిన, నిపుణులైన కార్మికుల కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రష్యా భారత్ వైపు చూస్తోంది. తమ సమస్య పరిష్కారానికి త్వరలోనే భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. కనీసం 70 వేల మంది భారతీ యులను ఈ ఏడాది చివరికల్లా రష్యాలోని వివిధ ప్రాంతాల్లోని నిర్మాణ, వస్త్ర, ఇంజనీరింగ్, ఎల క్ట్రానిక్స్ పరిశ్రమల్లో చేర్చుకోనుంది.
వీరికి అవసరమైన ఏర్పాట్లను రష్యా కార్మిక శాఖ చేపట్టింది. డిసెంబర్ మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యట నకు రానున్నారు. ఆ సమయంలో ఇరు దేశాలు ఇందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం ఫలితంగా భారతీయ కార్మికులు, సిబ్బందికి రష్యాలో చట్ట పరమైన రక్షణలు లభిస్తాయి. ఈ పరిణామాన్ని మాస్కోలోని ఇండియన్ బిజినెస్ అలయెన్(ఐబీఏ) స్వాగతించింది.
భారత్– రష్యా సంబంధాల్లో ఇదో వ్యూహాత్మక మైలురాయిగా మారనుందని ఐబీఏ ప్రెసిడెంట్ సమ్మీ మనోజ్ కొత్వానీ అభివర్ణించారు. భారతీయ నిపుణులకు సురక్షితమైన, గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూనే, రష్యా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవశక్తిని అందనుందన్నారు. భారతీయ సిబ్బందికి అవసరమైన రష్యన్ భాషా నైపుణ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వారి సంక్షేమానికి, భద్రతకు సంబంధించిన అంశాలపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉంటామన్నారు.


