పుత్రజయ: ప్రభుత్వ నిధుల దురి్వనియోగం కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్(72)కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతోపాటు రూ.2,500 కోట్ల భారీ జరిమానా విధిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పెట్టుబడి నిధి 1ఎంబీడీ నుంచి కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టిన అతిపెద్ద అవినీతి కేసులో ఆయన్ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
1 ఎంబీడీ నిధి నుంచి తన సొంత ఖాతాకు రూ.6,500 కోట్లను మళ్లించారంటూ దాఖలైన కేసులో అధికార దురి్వనియోగం, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై 25 ఆరోపణలున్నాయి. ప్రస్తుతం 1ఎంబీడీ అవినీతి కేసులోనే నజీబ్ రజాక్ జైలులో ఉన్నారు. ఈ శిక్షాకాలం ముగిశాక, తాజా తీర్పు ప్రకారం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ప్రకటించారు.
జరిమానా చెల్లింపులో విఫలమైన పక్షంలో ఆయన మరో 10 ఏళ్లు జైలులోనే గడపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, తానెలాంటి తప్పూ చేయలేదని రజాక్ అంటున్నారు. ఈ నిధులన్నీ సౌదీ అరేబియా నుంచి అందిన రాజకీయ విరాళాలని అంటున్నారు. లౌ టెక్ ఝో అనే ఫైనాన్షియర్ వల్లే కుంభకోణంలో ఇరుక్కోవాల్సి వచి్చందంటున్నారు. లౌ టెక్ ఝొ మాత్రం ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద 1 ఎంబీడీ ఆర్థిక కుంభకోణంలో ఈ తీర్పును మైలురాయిగా భావిస్తున్నారు.


