breaking news
India-Russia Relations
-
రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలకు దిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలుసహా పలురకాల వాణిజ్య కార్యకలాపాల కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్‌లపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరికలు చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రుట్టే బ్రెజిల్, చైనా, భారత్‌లను హెచ్చరించారు. బుధవారం అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్లో సమావేశమైన అనంతరం మీడియాతో రుట్టే మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను శాంతి చర్చలకు ఒప్పించేలా పుతిన్‌పై భారత్, చైనా, బ్రెజిల్‌లు ఒత్తిడితేవాలని రుట్టే వ్యాఖ్యానించారు. ‘భారత ప్రధాన మంత్రి, చైనా అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడు... మీరు ఎవరైనా కావొచ్చుగానీ రష్యాతో మీరు ముడిచమురు, సహజ వాయువు కొనుగోలుసహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయండి. మీరో విషయం గుర్తుంచుకోవాలి. రష్యాలోని ఆ పెద్దమనిషి(పుతిన్) గనక ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారిఫ్‌ల కొరడాతో రంగంలోకి దిగుతా. భారత్, బ్రెజిల్, చైనాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తా. ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తా. నా ఈ హెచ్చరికలను మీరు చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. లేదంటే దీని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోక తప్పదు. కొత్తగా ఈ 100 శాతం టారిఫ్‌ల బాధ తప్పాలంటే మీరు వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి బాగా పెంచాలి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు పుతిన్‌ను ఒప్పించాలి. పుతిన్ ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలి. పుతిన్‌కు వెంటనే ఫోన్ చేసి, శాంతి చర్చలపై మరింత సీరియస్‌గా ఆలోచించాలని సూచనలు చేయండి. మీరు చర్చలపై ముందడుగువేయకుంటే నాటో మాపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తుందట అని పుతిన్‌కు చెప్పండి. శాంతి ఒప్పందంగనక సాధ్యంకాకపోతే మీ మూడు దేశాలపై టారిఫ్‌లు విధించడం ఖాయం. ఈ గుదిబండను మీరు మోయకతప్పదు’’’ అని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సైనిక మద్దతు మరింత పెంచుతామని, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై టారిఫ్‌లను విపరీతంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు రుట్టే ఇలా భారత్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. రష్యా, దాని భాగస్వాములపై 100 శాతం సుంకాలు విధిస్తాం: అమెరికా రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి ముడిచమురును కొనుగోలుచేసే దేశాలపై మరోదఫా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ‘50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరాల్సిందే. అది జరక్కపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. టారిఫ్‌ల మోత మోగిస్తా. ఇతర ఆర్థిక ఆంక్షలు మోపుతా’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే మరోదఫా టారిఫ్‌లను అమలు చేయవచ్చన్నారు. అత్యధిక కొనుగోలుదారుల్లో భారత్ తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న, కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, తుర్కియే తొలి వరసలో ఉన్నాయి. ట్రంప్ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో ట్రంప్ కొత్తగా టారిఫ్‌ల కొరడా ఝులిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే వీలుంది. ట్రంప్ బెదిరింపులపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ దీటుగా స్పందించారు. ‘ ట్రంప్‌తో చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ రష్యానే బెదిరించాలని చూడటం తగదు. అలి్టమేటం జారీ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇవ్వవని గుర్తుంచుకుంటే మంచిది’ అని సెర్గీ వ్యాఖ్యానించారు. -
India-Russia relations: మాస్కోలో మోదీ.. నేడు పుతిన్‌తో చర్చలు
మాస్కో/న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని నూతన సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన ఆరంభమైంది. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యాకు విచ్చేశారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. తర్వాత దౌత్య, అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి, సహకార బంధంపై సమగ్ర, లోతైన చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం చర్చకొచ్చే అవకాశముంది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకొచ్చే అవకాశముంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మోదీకి పుతిన్ విందు...మాస్కో శివారులోని నోవో–ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహా్వనించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు. మోదీ పాలనలో భారత్ సాధించిన అభివృద్ధిని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు. అంతకుముందు‡మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రష్యా మొదటి ఉపప్రధాని డెనిస్ మాన్ట్సురోవ్ సాదర స్వాగతం పలికారు. అక్కడే మోదీ రష్యా సైనికుల సైనికవందనం స్వీకరించారు. ది కార్ల్టన్ హోటల్ల్లో మోదీకి పెద్దసంఖ్యలో భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు. హిందీ పాటలకు భారతీయులు, రష్యా కళాకారులు నృత్యంచేస్తూ మోదీని ఆనందంలో ముంచెత్తారు. ‘ఇప్పుడే మాస్కో నేలపై అడుగుపెట్టా. మిత్రుడు పుతిన్‌తో భేటీకి ఎదురుచూస్తున్నా. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోబోతున్నా. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు ఇరువురం మా వంతు కృషిచేస్తాం’’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్
భారత్‌కు ముడి చమురు సరఫరా చేయటంలో సౌదీ అరేబియా, ఇరాక్లను వెనక్కి నెట్టింది రష్యా. ఈ ఏడాది అక్టోబరులో అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం. అదే ఈ ఏడాది అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకోవడం గమనార్హం. దీంతో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 శాతానికి చేరింది. మరోవైపు.. ఇరాక్ నుంచి 20.5 శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తర్వాత మాస్కో నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి గణనీయంగా పెరిగింది. పశ్చిమ దేశాలు రష్యా చమురు ఎగమతులపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరకు విక్రయించేందుకు ముందుకొచ్చింది మాస్కో. అందిపుచ్చుకున్న భారత్ భారీ ఎత్తున దిగమతులను పెంచుకుంది. డిసెంబరు 2021లో రష్యా నుంచి భారత్‌కు రోజుకి 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. అదే ఇరాక్ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగింది. ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 68,600 పీపాల ముడి చమురు రాగా.. మే నెలలో అది 2,66,617 పీపాలకు పెరిగింది. జూన్ నాటికి గరిష్ఠంగా 9,42,694కు చేరింది. మరోవైపు.. ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్ బీపీడీలతో ఇరాక్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా రెండో స్థానానికి చేరింది. ఇదీ చదవండి: చుక్కలనంటుతున్న అద్దెలు, కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు -
సవాళ్లకు నిలిచిన ఇండో– రష్యా స్నేహం
న్యూఢిల్లీ: భారత్, రష్యాల స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రెండు దేశాలు కలిసి ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వం తెస్తాయని అభిలíÙంచారు. రష్యాలోని వ్లాడివోస్టోక్ నగరంలో జరుగుతున్న ఈఈఎఫ్(ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్) సమావేశాలనుద్దేశించి ఆయన ఆన్లైన్లో ప్రసంగించారు. కరోనా సమయంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరిగిందని మోదీ చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పుతిన్ చేపడుతున్న చర్యలను మోదీ కొనియాడారు. ఈ విషయంలో రష్యాకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు. రష్యాలో సహజవనరులున్నాయని, భారత్‌లో మానవవనరులున్నాయని, రెండూ కలిసి అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. యాక్ ఫార్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2019లో జరిపిన రష్యా పర్యటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రష్యాతో కీలక, నమ్మక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంలో ఈ పాలసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కరోనాతో వైద్యారోగ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత తెలియవచి్చందన్నారు. అగ్రో, సెరామిక్స్, రేర్ఎర్త్ మినరల్స్, డైమండ్స్ తదితర రంగాల్లో కొత్త అవకాశాలను ఇరుదేశాలు అన్వేíÙస్తున్నాయని చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతానికి చెందిన 11 ప్రాంతాల గవర్నర్లను భారత్‌లో పర్యటించాలని మోదీ ఆహా్వనించారు. -
బ్రహ్మోస్‌కు పోటీగా చైనా కొత్త క్షిపణి
బీజింగ్: భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్ సంస్థ సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్షిపణిని చైనా మిత్రదేశం పాకిస్తాన్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర చైనాలోని ఓ రహస్య ప్రాంతంలో సోమవారం గువాంగ్డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ ఈ క్షిపణి పరీక్ష జరపగా, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు తేలిందంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. హెచ్డీ–1 అని పేరుపెట్టిన ఈ క్షిపణిని హోంగ్డా సంస్థ తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం ఆమోదించాక హోంగ్డా కంపెనీ ఈ క్షిపణిని ఇతర దేశాలకు అమ్మనుంది. -
‘అణు’ ఆటంకాలను అధిగమిద్దాం
మాస్కో: రక్ష ణ, ఇంధనం, పెట్టుబడుల రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, సహకారాన్ని బలోపేతం చేయాలని భారత్, రష్యా సంకల్పించాయి. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ)లో రెండో, మూడో నంబర్ రియాక్టర్ల ఏర్పాటుకు న్యాయపరంగా ఎదురైన చిక్కులను పరిష్కరించుకోవాలని నిర్ణయించా యి. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారమిక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల 14వ వార్షిక భేటీలో భాగంగా ప్రతినిధుల స్థాయిలో గంటన్నరకు పైగా సాగిన చర్చల్లో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చిం చారు. పాక్, ఉగ్రవాద అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. పుతిన్‌తో మన్మోహన్‌కు ఇది ఐదో భేటీ. భేటీ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. పౌర అణు సహకారంపై 2010లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్‌మ్యాప్ అమలుకు కట్టుబడి ఉన్నామని మన్మోహన్ చెప్పారు. ఇందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. రష్యా సాయంతో తమిళనాడులోని కూడంకుళంలో నిర్మించిన అణు ప్లాంటులో రెండు కొత్త రియాక్టర్ల ఏర్పాటు, సాంకేతిక సహకారం కోసం ఒప్పందాన్ని శీఘ్రంగా ఖరారు చేయాలని సంకల్పించినట్లు ఉభయ దేశాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కేఎన్‌పీపీని భారత అణు ప్రమాద బాధ్యత చట్టం పరిధిలోకి కాకుండా అంతర్ ప్రభుత్వాల ఒప్పందం పరిధిలోకి తీసుకురావాలని రష్యా పట్టుపడుతుండడంతో కొత్త రియాక్టర్ల ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనడం తెలిసిందే. కాగా, తమ దేశంలో తయారైన కూడంకుళం ఒకటో యూనిట్ ప్రారంభంపై పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. దాన్నుంచి విద్యుత్ కొన్ని గంటల్లో గ్రిడ్‌కు అనుసంధానం కానుందన్నారు. ఇంధనం, రక్షణ, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని పుతిన్, మన్మోహన్ చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల మధ్య కూడా గత ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 25 శాతం పెరిగి 1,100 కోట్ల డాలర్లు చేరుకుందన్నారు. పుతిన్, మన్మోహన్‌ల భేటీ సందర్భంగా ఇరు దేశాలు ఐదు ఒప్పందాలు చేసుకున్నాయి. ఖై దీలు మిగిలిన శిక్షను స్వదేశంలో పూర్తి చేసుకోవ డానికి వారిని స్వదేశానికి బదిలీ చేయడం, ఇంధనం, బయోటెక్నాలజీ, శాస్త్రసాంకేతికం తదితర రంగాల్లో సహకారంపై వీటిని కుదుర్చుకున్నాయి. ఐఎంఎఫ్‌ను సంస్కరించాలి.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో తక్షణమే సంస్కరణలను చేపట్టాలని, వర్ధమాన దేశాలకు తమ వాణి వినిపించేందుకు వాటికి మరింత ప్రాతి నిధ్యం కల్పించి ఓటు హక్కు విలువ పెంచాలని ఇరు దేశాలు కోరాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విస్తరించాలన్నాయి. మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా పేర్కొంది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న నిఘా సంబంధ ఆపరేషన్లపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, భేటీ సందర్భంగా పుతిన్, మన్మోహన్లు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ‘భారత్, రష్యాల ఉమ్మడి విజయాల్లో చాలా వాటిని మీ నాయకత్వంలోనే సాధించాం’ అని పుతిన్.. మన్మోహన్‌తో అన్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన ఘనత మీదేనని మన్మోహన్.. పుతిన్‌తో చెప్పారు. అంతకుముందు మన్మోహన్ మాస్కోలోని మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలే షన్స్‌లో ఉపన్యసించారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఉభయ దేశాల సంబంధాలు కాలానికి అనుగుణంగా మారాలన్నారు. రక్షణ అవసరాల విషయంలో రష్యా ఇకముందూ తమకు కీలక భాగస్వామిగానే ఉంటుందని స్పష్టం చేశారు. మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మన్మోహన్‌కు అరుదైన గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇచ్చిన ఈ పట్టాను తనకు గొప్ప గౌరవమని మన్మోహన్ పేర్కొన్నారు.