
హెల్సింకి: భారతదేశం.. రష్యా, చైనాల మాదిరి కాదని..అదొక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ అని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంలో భారతదేశ భౌగోళిక, రాజకీయ పాత్రను, శాంతి చర్చలలో భాగస్వామ్యాన్ని ఆయన వివరించారు. సాంకేతిక, వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్- ఫిన్లాండ్ సంబంధాలను బలోపేతం చేయడానికి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.
ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశ అభివృద్ధిని కొనియాడుతూ పాశ్చాత్య దేశాలు ఆ దేశంతో మరింత సన్నిహితంగా మెలగాలని కోరారు. బ్లూమ్‌బెర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశం, రష్యా, చైనా మధ్య పెరుగుతున్న సమన్వయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం అటు యూరోపియన్ యూనియన్‌కు, ఇటు యునైటెడ్ స్టేట్స్‌కు సన్నిహిత మిత్రదేశం. అందుకే రష్యా, చైనా దేశాల జాబితాలో భారత్‌ను చేర్చనన్నారు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. అందుకే పశ్చిమ దేశాలు భారతదేశంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని అన్నారు.
🚨 BIG STATEMENT
🇫🇮 Finland Prez Stubb: “India is a very close ALLY of the EU & US.”
“India is an emerging SUPERPOWER with demography & economy on its side.” 🔥
“West must engage with India.” 🎯 pic.twitter.com/oVwfEA3ERW— Megh Updates 🚨™ (@MeghUpdates) September 24, 2025
రష్యా- చైనా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయని భావిస్తున్నానని, 1990ల ప్రారంభంలో చైనా-రష్యా ఒకే పరిమాణంలో ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు చైనా 10 రెట్లు వృద్ధి సాధించింది. ఇప్పుడు రష్యా నుంచి చమురు,గ్యాస్ కొనుగోలు, సాంకేతిక మార్పిడితో పరస్పర సహకారం అందిస్తోంది. ఇది రష్యా యుద్ధ తంత్రానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే ఆ దేశాల మధ్య దగ్గరి సంబంధం ఉన్నదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.
భారతదేశంతో ఇతర దేశాల భాగస్వామ్యం కోసం ఫిన్లాండ్ పిలుపు నివ్వడం ఇది మొదటిసారి కాదని, అంతకుముందు, హెల్సింకి సెక్యూరిటీ ఫోరం 2025లో కోరామన్నారు. తాను ఇటీవల ప్రధాని మోదీతో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడానని, తొలుత కాల్పుల విరమణ అవసరమని, ఆ తర్వాతనే శాంతి చర్చలను ప్రారంభించగలమని మోదీ పేర్కొన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు హాజరైన షాంఘై సహకార సంస్థ (ఎసీసీఓ)సమ్మిట్‌కు హాజరయ్యారని, ఆ సమయంలో వారి మధ్య స్నేహాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు.