కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ జెండా ఎగరేసి రష్యా యుద్ధం మొదలెట్టాక రెండు దేశాల్లో మొత్తంగా 20 లక్షల మంది చనిపోయారని ‘సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్‌ఐఎస్)’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ‘‘ఉక్రెయిన్ ప్రతిదాడిలో రష్యాలో కనీసం 12 లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 3,25,000 మంది సైనికులు ఉన్నారు.
తక్కువ సైన్యంతో రష్యాతో పోరాడిన ఉక్రెయిన్ బలగాల్లో 1,40,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడటం, జాడ తెలీకుండా పోవడం, శత్రుదేశ సైన్యానికి చిక్కి బందీలుగా రష్యాకు బలవంతంగా తరలిపోయిన కేటగిరీలో 6,00,000 మంది ఉన్నారు. కొద్దిపాటి భూభాగం, విలువైన ఖనిజ నిల్వలపై ఆధిపత్యం పొందే క్రమంలో రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వంటి అగ్రరాజ్యం ఇంతటి ప్రాణనష్టాన్ని చవిచూడడం చరిత్రలో ఇదే తొలిసారి’’ అని నివేదిక పేర్కొంది.


