
24 మంది వృద్ధులు మృత్యువాత
ఉక్రెయిన్‌లోని యరోవా గ్రామంలో విషాదం
కీవ్: పింఛనుదారుల క్యూలైన్‌పై రష్యా జరిపిన దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. స్లొవెయాన్‌స్క్ నగరానికి సమీపంలోని యరోవా గ్రామంలో మంగళవారం ఉదయం పింఛను తీసుకునేందుకు క్యూలైన్‌లో నిల్చున్న వృద్ధులపై రష్యా యుద్ధ విమానం గ్లైడ్ బాంబును జారవిడిచింది. ఘటనలో 24 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులంతా రిటైర్డు ఉద్యోగులని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ దారుణాన్ని వరి్ణంచడానికి మాటలు చాలవన్నారు. ఇది రష్యా పాల్పడిన క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండరాదనీ, తమపై దురాక్రమణకు పాల్పడినందుకు ప్రతిగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించి, ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపునిచ్చారు. ఘటనపై రష్యా రక్షణ శాఖ స్పందించలేదు. ఘటనాప్రాంతం దృశ్యాలు, దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న పోస్టల్ శాఖ వ్యాను ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. పోస్టల్ శాఖ ఉద్యోగి సైతం గాయపడ్డారు.