న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా బంపరాఫర్ ప్రకటించింది. రోస్‌నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది.
భారత రిఫైనర్లకు యురల్స్ ధర డెలివరీ ప్రాతిపదికన డేటెడ్ బ్రెంట్‌తో పోలిస్తే బ్యారెల్‌పై ఏడుడాలర్ల వరకు తగ్గించింది. ఈ ఆఫర్ డిసెంబర్‌లో లోడ్ అయ్యే, జనవరిలో భారత్‌కు చేరే కార్గోలపై వర్తించనుంది.అమెరికా ఆంక్షలకు ముందు యురల్స్ బ్యారెల్‌కు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్ ఇచ్చింది.
రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు అమలులోకి వచ్చిన తర్వాత భారత రిఫైనర్లు రష్యన్ చమురు ఆర్డర్లు తగ్గించాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత భారత్ చౌకైన చమురును విస్తృతంగా దిగుమతి చేసుకుంది. కానీ ఆంక్షల కారణంగా దిగుమతి నిలిపివేసింది.
రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌తో పాటు గాజ్‌ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్‌నెఫ్టెగాస్‌పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత రిఫైనర్లు మధ్యప్రాచ్యం సహా ఇతర ప్రాంతాల నుండి ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేస్తున్నారు. రష్యా చమురు ధరలు తగ్గడం భారత్‌కు తాత్కాలిక లాభం కలిగించవచ్చు. కానీ ఆంక్షల కారణంగా సరఫరా స్థిరత్వం అనిశ్చితంగా మారింది. రిఫైనర్లు తక్కువ ధరల ఆకర్షణతో రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నా, దీర్ఘకాలంలో అమెరికా ఆంక్షలు వాణిజ్యాన్ని మరింత క్లిష్టం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


