కిన్షాసా: కాంగోలోని మారుమూల ఇటురి ప్రావిన్స్‌లో ప్రమాకర ఎబొలా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు కనీసం 65 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోగా, మరో 246 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. మొంగ్వాలు, ర్వాంపర ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు బయటపడుతున్నాయని ఆఫ్రికా సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ శుక్రవారం వెల్లడించింది.
ప్రమాదకరమైన ఈ వైరస్ వాంతులు, రక్తం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగిస్తుంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు.


