హంటా వైరస్‌ కలకలం | Trump key comments on Hantavirus | Sakshi
Sakshi News home page

హంటా వైరస్‌ కలకలం

May 8 2026 11:30 AM | Updated on May 8 2026 11:51 AM

Trump key comments on Hantavirus

వాషింగ్టన్ డీసీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటావైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్‌పై తనకు సమాచారం అందిందని ప్రస్తుతానికి పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఇటీవల ఓ క్రూయిజ్‌షిప్‌లో హంటా వైరస్‌తో ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి మీడియా హంటా వైరస్‌ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా "అంతా అదుపులోనే ఉందని మేము ఆశిస్తున్నాం. ఆ నౌక గురించి రేపు పూర్తి నివేదిక ఇవ్వబోతున్నాం. గొప్ప నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు, అంతా బాగుంటుంది," అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. 

హంటా కలకలం

కాగా ఈ నౌకలో ‍ప్రయాణించి అమెరికా చేరుకున్న ఐదుగురు పౌరులకు ‍అమెరికా క్వారంటైన్ విధించింది. ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంబీ హోండియన్‌ క్రూయిజ్‌ నౌకలో హంటా వైరస్‌తో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురిని వ్యాది అనుమానిత రోగులుగా గుర్తించారు. ‍అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్‌ సోకలేదని నిర్ధారించుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్‌ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్‌ లక్షణాలు వెలుగుచూశాయి.

దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్‌ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్‌ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.

హంటావైరస్ అంటే ఏమిటి ?
హంటావైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించడం చాలా అరుదు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపించదు కాబట్టి, సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే ప్రమాదం తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement