కాంగోలో ఎబోలా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ దాదాపు 87 మంది మృతిచెందారు. దీంతో వరల్డ్ హల్త్ ఆర్గనైజేషన్ (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
డెమెక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎబొలా వైరస్‌తో అట్టుడుకిపోతుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 87 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. తూర్పు ఇటూరి, బూనియా ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 347 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు నమోదైన 87 మరణాలలో... 57 మోంగ్వాలులో, 27 ర్వాంపారాలో, బునియా మూడు మరణాలు సంభవించాయి. అయితే (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ఎబొలాను మహమ్మారి (Pandamic) గా మాత్రం ప్రకటించలేదు.
ఈ వైరస్ లక్షణాలు
ప్రమాదకరమైన ఈ వైరస్ వాంతులు, రక్తం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగిస్తుంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు.


