కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్‌ ప్లాన్‌..? | us war iran to use kamikaze dolphins to attack us ships in hormuz | Sakshi
Sakshi News home page

కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్‌ ప్లాన్‌..?

May 6 2026 7:14 PM | Updated on May 6 2026 7:35 PM

 us war iran to use kamikaze dolphins to attack us ships in hormuz

ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌ ‍అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్‌ కామికేజ్‌ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్‌ హెగ్సెత్‌ స్పందించారు.

ప్రస్తుతం హర్ముజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్‌ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్‌  అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్‌ నౌకశ్రయాలను బ్లాకేడ్‌ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జనరల్‌లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది.

ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్‌లను వాడడం పూర్తిగా అవాస్తవం  ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను  ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.

ఇరాన్  వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా

ఇరాన్‌ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్‌లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా  
అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్‌లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి  బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

డాల్ఫిన్ల ప్రత్యేకత

సైనిక అవసరాల కోసం డాల్ఫిన్‌లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్‌ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్‌సైట్ పేర్కొంది.

కామికేజ్ అనే పేరు

సాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను  అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్‌మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement