పాకిస్థాన్‌లో భారీ పేలుడు, ఏడుగురి మృతి | Blast Rocks Pakistan Market | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో భారీ పేలుడు, ఏడుగురి మృతి

May 12 2026 12:30 PM | Updated on May 12 2026 12:44 PM

Blast Rocks Pakistan Market

లక్కీ మార్వాట్‌: పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురి మృతి చెందారు. వాయువ్య పాకిస్థాన్‌లోని లక్కీ మార్వాట్‌ ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో జరిగిన శక్తిమంతమైన పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, గత శనివారం రాత్రి.. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బన్ను జిల్లాలోని ఫతే ఖేల్‌ పోలీస్‌ పోస్ట్‌ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. ఈ భారీ పేలుడుతో పోలీస్‌ పోస్ట్‌ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. ఇది తెహ్రీక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement