శాంతికి భారత్‌ కీలకం  | India can play greater role for peace in West Asia | Sakshi
Sakshi News home page

శాంతికి భారత్‌ కీలకం 

May 16 2026 4:58 AM | Updated on May 16 2026 4:58 AM

India can play greater role for peace in West Asia

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్‌ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్‌కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్‌ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్‌ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement