పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 21 మంది జవాన్లు మృతి | Attack In Pakistan Khyber Province | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 21 మంది జవాన్లు మృతి

May 11 2026 7:01 AM | Updated on May 11 2026 9:36 AM

Attack In Pakistan Khyber Province

పెషావర్‌: పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. శనివారం రాత్రి బన్ను జిల్లాలోని ఫతే ఖేల్‌ పోలీస్‌ పోస్ట్‌ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. 

అనంతరం సంభవించిన భారీ పేలుడుతో పోలీస్‌ పోస్ట్‌ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడిచేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ ఇది తెహ్రీక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement