Khyber
-
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. 21 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. శనివారం రాత్రి బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్‌ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. అనంతరం సంభవించిన భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడిచేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
సొంత ప్రజలపైనే పాక్ బాంబులతో దాడి
-
వరదల్లో కొట్టుకుపోయిన పెళ్లి వాహనం
పెషావర్: వివాహ విందుకు వెళుతుండగా అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో వాహనం కొట్టుకుపోవడంతో 26 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో 18 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన వాయువ్య పాకిస్తాన్లో ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగింది. మృతదేహాలను వెలికితీసి లండీ కోటల్లో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ దేశవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో 55 మంది మృతి చెందినట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


