మయన్మార్‌ గనిలో 11 వేల క్యారెట్ల భారీ కెంపు లభ్యం  | Massive 11000-carat ruby unearthed in Mogkok gem tract | Sakshi
Sakshi News home page

మయన్మార్‌ గనిలో 11 వేల క్యారెట్ల భారీ కెంపు లభ్యం 

May 9 2026 12:36 AM | Updated on May 9 2026 12:36 AM

Massive 11000-carat ruby unearthed in Mogkok gem tract

బ్యాంకాక్‌: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ రత్నాల గనుల కేంద్రంలో 11,000 క్యారెట్ల, 2.2 కిలోల బరువున్న భారీ కెంపు బయటపడింది. ఇక్కడ లభించిన భారీ కెంపుల్లో ఇది రెండోదని చెబుతున్నారు. 1996లో ఏకంగా 21,450 క్యారెట్ల, 4.29 కిలోల కెంపు మయన్మార్‌లో బయటపడింది. అయితే, తాజాగా ఎగువ మాండలే ప్రాంతంలో దొరికిన కెంపు రంగు, నాణ్యత పరంగా ఎంతో మెరుగైందని చెబుతున్నారు. 

ఊదా రంగు కలిసిన ఎరుపు వర్ణంతో లేత పసుపు ఛాయలు ఉన్న ఈ కెంపు అత్యుత్తమ రంగును, మధ్యస్థమైన పారదర్శకతను, కాంతిని అధికంగా ప్రతిబింబించే ఉపరితలాన్ని కలిగి ఉంది. 

ఏప్రిల్‌లో గని కార్మీకులు ఈ కెంపును కనుగొన్నారని ప్రభుత్వం ఆదీనంలోని గ్లోబల్‌ న్యూ లైట్‌ ఆఫ్‌ మయన్మార్‌ కథనం పేర్కొంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన పిజియన్‌ బ్లడ్‌ కెంపులకు మయన్మార్‌ పెట్టింది పేరు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే కెంపుల్లో 90 శాతం వరకు మయన్మార్‌లోనివే. ఇవి ఎక్కువగా దేశంలోని మొగొక్, మొంగ్‌ హెచ్‌సు రత్నాల గనుల్లో దొరుకుతాయి. ఇవే మయన్మార్‌కు ప్రధాన ఆదాయ వనరు.  

Advertisement
 
Advertisement
Advertisement