తొమ్మిదేళ్ల తర్వాత తమ దేశంలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చైనా ఘన స్వాగతం పలికింది. రెడ్‌కార్పెట్ పరిచి సైనిక గౌరవ వందనం సమర్పించింది. అనంతరం గ్రేట్ హాల్ పీపుల్ వద్ద ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కరచలనం చేశారు. ఈ ఇద్దరూ హాల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆపై మీడియా ముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘మీరు గొప్ప వ్యక్తి. మీకు స్నేహితుడిని కావడం.. మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మనం కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించబోతున్నాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే తనతో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపార నాయకులను చూపిస్తూ.. “మీకు గౌరవం తెలిపేందుకు మాత్రమే అత్యుత్తమ వ్యక్తులు ఇక్కడికి తరలి వచ్చారు” అని ట్రంప్ జిన్‌పింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మనవి కామన్ ఇంట్రెస్టులు.. స్వల్ప విబేధాలు. ఇప్పటిదాకా.. సమస్యలు వచ్చినప్పుడు మీరు నన్ను సంప్రదించేవారు, నేను మిమ్మల్ని సంప్రదించేవాడిని. చాలా త్వరగా పరిష్కారం కనుగొనగలిగాం. ఇక నుంచి మనం రైవల్స్‌గా ఉండకూదు అంటూ ట్రంప్ జిన్‌పింగ్‌ను ఆకాశానికెత్తారు. చైనా-అమెరికా ద్వైపాక్షిక చర్చల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.. మన మధ్య జరగబోయే సమావేశం ఎంతో గొప్పది. ప్రపంచంలోని బెస్ట్ బిజినెస్ లీడర్స్‌ను తీసుకొచ్చా. రండి.. బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం అని ట్రంప్ ఉద్ఘాటించారు.
"It's an honor to be with you, it's an honor to be your friend, and the relationship between China and the USA is going to be better than ever before." - President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/WZkoGeVqhv
— The White House (@WhiteHouse) May 14, 2026
అనంతరం.. జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘ట్రంప్‌నకు, అమెరికన్లను ముందస్తుగా 250 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం ఇప్పుడు క్రాస్ రోడ్‌లో ఉంది. పాత ట్రాప్స్‌నుంచి బయటకు వద్దాం. ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కొందాం. ఇరాన్‌పై ఒత్తిడి పెంచి.. హర్ముజ్ తెరిపిస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
చైనా పర్యటనలో ట్రంప్‌తో పాటు అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌తో సహా 16 మంది సీఈవోలు వెళ్లారు. నేడు, రేపు ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించినప్పటికీ, టారిఫ్స్, టెక్నాలజీ, ట్రేడ్‌తో పాటుగా తైవాన్‌పై అమెరికా వైఖరి, ఇరాన్ యుద్ధం వంటి అంశాలపైనా చర్చలు జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


