అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి | Gun shooting at Korean supermarket near Dallas | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి

May 6 2026 7:00 AM | Updated on May 6 2026 8:53 AM

Gun shooting at Korean supermarket near Dallas

వాషింగ్టన్‌: అ‍గ్రరాజ్యం అమెరికాలో మరో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. డల్లాస్‌ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, టెక్సాస్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో నిందితుడిని కొరియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డల్లాస్‌లో కారోల్టన్‌లోని కొరియన్‌ ‘కె టౌన్‌ ప్లాజా’ షాపింగ్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వ్యాపార లావాదేవీల గురించి చర్చిస్తుండగా ఉద్దేశపూర్వకంగానే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటన అనంరతం, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని కొరియాకు చెందిన సెయింగ్‌ హన్‌ హు(69)గా గుర్తించినట్టు పోలీసు అధికారి రాబర్టో అర్రెడోన్డో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement