మసాజ్‌ పేరుతో 61 మందిపై లైంగిక దాడి.. భారత సంతతి అరెస్ట్ | 61 people sexually assaulted in Australia | Sakshi
Sakshi News home page

మసాజ్‌ పేరుతో 61 మందిపై లైంగిక దాడి.. భారత సంతతి అరెస్ట్

May 17 2026 12:00 PM | Updated on May 17 2026 12:07 PM

61 people sexually assaulted in Australia

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సుమిత్‌ అనే వ్యక్తి  61మందిని మసాజ్‌ పేరుతో వేధించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో అతనికి  13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అనంతరం దేశబహిష్కరణ చేసింది.

అక్కడి అధికారులు వివరాల ప్రకారం 39 ఏళ్ల సుమిత్ అనే వ్యక్తి 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అతను అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య ఒక మసాజ్ పార్లర్‌లో పని చేశారు. కాగా ఆ సమయంలో మసాజ్ పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడు. మహిళల రహస్య వీడియోలు తీసి వారని లైంగికంగా వేదించాడు.కాగా ఈ కేసులో అతనిపై  97 అభియోగాలను నమోదు కాగా అ‍న్నింటిని కోర్టులో అంగీకరించాడు.

అయితే ఈ కోసును విచారించిన కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 61 మంది మహిళలపై లైంగిక దాడి చేసినందుకు గాను సుమిత్‌కు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అతను మహిళల నమ్మకాన్ని ఉల్లంఘించి, మసాజ్‌ల సమయంలో అనుచితమైన చర్యలకు పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. చికిత్స కోసం వచ్చని మహిళలను వారి నమ్మకాన్ని, భద్రతను దుర్వినియోగం చేశాడని  కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే సుమిత్‌కు సుమిత్‌కు మసాజ్ థెరపీలో ఎలాంటి అధికారిక అర్హతలు లేనప్పటికీ అక్రమంగా మసాజ్‌ సెంటర్‌లో విధులు నిర్వహస్తున్నారని శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడిని ఆస్ట్రేలియా బహిష్కరించవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement