చిన్నపాటి అసహనం పలు సందర్బాల్లో తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని అంటారు కదా.. అలాగే, ఘటనే ఒకటి థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఆవేశం, అసహనంతో ఓ చైనా టూరిస్ట్ చేసిన తప్పిందం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు వెళ్లింది. అలాగే, సదరు చైనా టూరిస్ట్ మరోసారి తమ దేశంలోకి రాకుండా జీవిత కాల నిషేధం కూడా విధించారు. ఇక, అతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ చైనా టూరిస్ట్ ఏం చేశాడంటే..
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన జెంగ్ లివేయ్(30) తన భార్యతో కలిసి థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చాడు. అనంతరం, బుధవారం మధ్యాహ్నం చైనాకు తిరిగి వెళ్లే విమానం కోసం బ్యాంకాంక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ఆటోమేటెడ్ పాస్‌పోర్ట్ నియంత్రణ వ్యవస్థను ఉపయోగిస్తున్నప్పుడు అసహనానికి గురయ్యాడు. చెక్ పాయింట్ వద్ద ఆటోమేటెడ్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయలేదు. దీంతో, ప్రయాణ పత్రాన్ని స్కానర్‌కు పదేపదే విసిరి, ఆటోమేటిక్ అడ్డంకులను తన్ని, గేట్ల గుండా బలవంతంగా వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
అనంతరం, క్లియరెన్స్ తీసుకోకుండా అతను చెక్‌పాయింట్ దాటిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. థాయ్ వార్తాపత్రిక 'ది నేషన్' ప్రకారం, ఆ తర్వాత జెంగ్ చైనీస్ భాషలో అధికారులను దూషించి, వారి వైపు వెళ్ళడానికి ప్రయత్నించగా, అతని భార్య అతన్ని నిలువరించింది. దీంతో, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, విధుల్లో ఉన్న అధికారులను అవమానించడం, అనుమతి లేకుండా ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ దాటడం వంటి ఆరోపణలతో అధికారులు అతనిపై పలు ఫిర్యాదులు నమోదు చేశారు.
🚨🇹🇭 Thai police arrested a Chinese traveler named Zheng Liwei for allegedly kicking and damaging two automated passport control gates at Suvarnabhumi Airport. The disturbance in the terminal resulted in charges being filed against him.
The consequences:
- The suspect agreed to… pic.twitter.com/oZbfkgyXh5— Jeab (@Jeab1030599) May 14, 2026
అంతేకాకుండా.. జెంగ్ కారణంగా ఆటోమేటెడ్ గేట్లకు సుమారు 4,80,000 బాత్(భారత కరెన్సీలో దాదాపు రూ.14 లక్షలు) నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనలో రెండు పాస్‌పోర్ట్ కంట్రోల్ గేట్లు దెబ్బతిన్నాయని నివేదికలు తెలిపాయి. అనంతరం, థాయ్ అధికారులు అప్పటి నుండి జెంగ్ వీసాను రద్దు చేసి, అతడిని జీవితకాల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీనివల్ల భవిష్యత్తులో అతను థాయ్‌లాండ్‌లోకి తిరిగి ప్రవేశించకుండా సమర్థవంతంగా నిరోధించబడ్డాడు. SCMP నివేదిక ప్రకారం చట్టపరమైన విచారణలు పూర్తయిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరిస్తారు.
నిఘా కఠినతరం..
మరోవైపు.. థాయ్‌లాండ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల దుష్ప్రవర్తనపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, థాయ్ అధికారులు విదేశీ సందర్శకులపై నిఘాను కఠినతరం చేస్తున్నారు. ఈ తరుణంలో జెంగ్ ఘటన వెలుగుచూసింది. దీంతో, ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా థాయ్‌లాండ్ 93 దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు వీసా రహిత బసను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి సిహాసక్ ఫువాంగ్‌కెట్కియో ప్రకారం.. నేర కార్యకలాపాలను అరికట్టడం మరియు దీర్ఘకాలిక బసల దుర్వినియోగాన్ని నివారించడం ఈ చర్య యొక్క లక్ష్యం.
ఇదిలా ఉండగా.. పలు దేశాల్లో టూరిస్ట్‌లు అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా నిబంధనలు ఉన్నాయి. ఇతర దేశాల్లో పర్యాటకులు విమానాశ్రయ ఆస్తులను ధ్వంసం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటూ, జరిమానాలు, జైలు శిక్షలు, లేదా జీవితకాల నిషేధాలు విధిస్తున్నారు.
ఇతర దేశాల్లో జరిగిన సంఘటనలు
స్పెయిన్ (2025): రయనైర్ విమానంలో అగ్ని ప్రమాదం సమయంలో పర్యాటకులు అత్యవసర గేట్లను బలవంతంగా తెరిచి, విమానాశ్రయ భద్రతా పరికరాలను ధ్వంసం చేశారు. దీనిపై జరిమానాలు విధించారు.
యూరప్ (వివిధ దేశాలు): పర్యాటకుల అసభ్య ప్రవర్తనపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా, విమానాశ్రయాల్లో ఆస్తి ధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడులు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని దేశాలు అమెరికన్ పర్యాటకులపై ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నాయి.
శిక్షలు ఇలా..
జరిమానాలు: నష్టం విలువ ఆధారంగా భారీ జరిమానాలు.
జైలు శిక్ష: ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, అధికారులపై దాడి వంటి కేసుల్లో 1–3 సంవత్సరాల జైలు శిక్ష.
వీసా రద్దు: వీసా తక్షణమే రద్దు చేసి, దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు.
జీవితకాల నిషేధం: తిరిగి ఆ దేశంలోకి ప్రవేశించకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం.
జరిమానాలు: వెనిస్‌లో కాలువల్లో ఈత కొట్టడం, చెత్త వేయడం వంటి చర్యలకు ₹50,000 వరకు జరిమానా.
డిపోర్ట్‌మెంట్: బాలి (ఇండోనేషియా)లో వీసా ఉల్లంఘనలు, పవిత్ర స్థలాల్లో అసభ్య ప్రవర్తనకు విదేశీయులను డిపోర్ట్ చేస్తున్నారు.
జైలు శిక్షలు: UAE, సింగపూర్‌లో మత్తులో అసభ్య ప్రవర్తనకు జైలు శిక్షలు.
వీసా రద్దు/నిషేధం: థాయ్‌లాండ్‌లో విమానాశ్రయ ఆస్తి ధ్వంసం చేసిన చైనా పర్యాటకుడికి జీవితకాల ప్రవేశ నిషేధం విధించారు.
యూరప్‌లో పర్యాటకుల జరిమానాలు
స్పెయిన్ (మాలాగా, మయోర్కా):
చెత్త వేయడం, శబ్దం చేయడం, సరైన దుస్తులు లేకుండా తిరగడం.
జరిమానా: €750 (₹70,000 సుమారు).
పోర్చుగల్ (అల్బుఫీరా, ఆల్గార్వే):
ప్రజా ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, అసభ్య ప్రవర్తన.
జరిమానా: €150–€1,800 (₹13,000–₹1.6 లక్షలు).
ఫ్రాన్స్ (పారిస్, బీచ్ ప్రాంతాలు):
మద్యం తాగి ప్రజా ప్రదేశాల్లో తిరగడం.
జరిమానా: €38–€135.


