పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు.
‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు.
మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్‌లో బీజేపీ బంపర్‌హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్‌లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది.


