మరో వివాదానికి తెరలేపిన ఎలాన్‌ మస్క్‌ | Elon Musk Says Instagram Is For Girls | Sakshi
Sakshi News home page

మరో వివాదానికి తెరలేపిన ఎలాన్‌ మస్క్‌

May 17 2026 10:53 AM | Updated on May 17 2026 11:09 AM

Elon Musk Says Instagram Is For Girls

ఇన్‌స్టాగ్రామ్‌ కేవలం అమ్మాయిల కోసమేనంటూ ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మరో వివాదానికి తెరలేపారు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్‌లైన్ ట్రెండ్స్‌పై జరుగుతున్న ఒక వైరల్ చర్చకు స్పందిస్తూ పురుషులను ఎగతాళి చేసే విధంగా కామెంట్స్‌ చేశారు. మనుషుల ఆన్‌లైన్ అలవాట్లు వారి జీవితంలోని విభిన్న దశలను ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై చర్చ నడిచింది.

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం, ఇంట్లో వండిన వంటకాల ఫోటోలను అప్‌లోడ్ చేయడం, ఆకర్షణీయమైన ఫోటోలు పోస్ట్ చేయడం వంటి సాధారణ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్స్‌ను ఆ థ్రెడ్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. కొంతమంది మగవాళ్లు తమ ఇన్‌స్టా ప్రొఫైల్స్‌ నాకు పంపుతుంటారు. అప్పుడు నాకు వాళ్లేమైనా లింగమార్పిడి చేయించుకుంటున్నారా అనిపిస్తుందంటూ మస్క్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ వైరల్ అవ్వగా.. మస్క్ చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషపూరితంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ పురుషులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న మహిళలు కావచ్చు. అక్కడ అంతా ఫేక్ మాత్రమే కనిపిస్తుందంటూ  కామెంట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement