వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్‌..? | trump back from china preps big iran strikes with epic fury | Sakshi
Sakshi News home page

వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్‌..?

May 16 2026 9:29 PM | Updated on May 16 2026 9:34 PM

trump back from china preps big iran strikes with epic fury

ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం మిడిల్‌ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది. టెహ్రాన్‌పై మరోసారి వైమానిక దాడులకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

ట్రంప్‌ చైనా పర్యటన ముగించుకొని ప్రయాణంలో ఇరాన్‌ ప్రతిపాదించిన శాంతియుత ఒప్పందాని ఆయన తోసిపడేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. "నేను దానిని చూశాను, మొదటి వాక్యం నచ్చకపోతే నేను దానిని పక్కన పడేస్తాను" అని ఆయన అన్నట్లు తెలిపాయి.

‍‍‍పశ్చిమాసియాలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారాని అమెరికా- ఇజ్రాయెల్‌ బలగాలు మరోసారి సంయుక్తంగా అమెరికాపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయనితెలిపినట్లు పేర్కొన్నాయి. కాగా ఇరాన్‌ అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించాయిని ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్‌ జలసంధిని తెరవాలని సంయుక్త ప్రకటన చేసినట్లు ANI నివేదిక పేర్కొంది.

చైనా రాగం పాడిన ట్రంప్

చైనా పర్యటన తిరుగు ప్రయాణంలో ట్రంప్ చైనా రాగం పాడారు. "మేము అక్కడ చాలా బాగా గడిపాము అది ఒక అద్భుతమైన కాలం. అధ్యక్షుడు షీ ఒక అద్భుతమైన వ్యక్తి. జిన్‌పింగ్‌, తాను తైవాన్ గురించి చాలా మాట్లాడుకున్నాము అన్నారు. అదే విధంగా ఇరాన్ గురించి చాలా చర్చించాము ఈ రెండు విషయాలపై మాకు చాలా మంచి అవగాహన ఉందని నేను భావిస్తున్నాను". అన్నారు.

కాగా ఇరు దేశాల చర్చలలో చైనాకు తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. బీజింగ్ తన భూభాగంగా చెప్పుకుంటున్న ఈ స్వయం పరిపాలన ద్వీపం విషయంలో ఉన్న విభేదాలు అమెరికా, చైనాల మధ్య ఘర్షణలకు లేదా సంఘర్షణలకు దారితీయవచ్చని జిన్‌పింగ్‌ వ్యక్తిగతంగా ట్రంప్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement