ట్రంప్‌ దాడికి.. ఇరాన్‌ మాస్టర్‌ ప్లాన్‌.. రష్యా సాయంతో..? | russia plan to help power iran kill machine against americans | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ దాడికి.. ఇరాన్‌ మాస్టర్‌ ప్లాన్‌.. రష్యా సాయంతో..?

May 10 2026 7:27 PM | Updated on May 10 2026 8:19 PM

russia plan to help power iran kill machine against americans

ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా యుద్ధం సీజ్‌ఫైర్‌ ఒప్పందంతో నడుస్తోంది.అయితే ఈ యుద్ధంలో అమెరికా మెుదటి నుంచి రష్యా ఇరాన్‌కు సహకారం అందించిందనే అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణల్ని బలపరుస్తూ 'ది ఎకనామిస్ట్' నివేదిక ప్రచురించింది. 
 

అమెరికా ఇరాన్‌ యుద్దంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్‌ తమ స్థావరాలపై దాడులు చేస్తోందన్నారు. ఇరాన్‌ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్‌ చేయగలుగుతుందని దీనిలో కచ్చితంగా మాస్కో హస్తం ఉందని ఆరోపించారు. 

 ది ఎకనామిస్ట్ నివేదిక  ఈ నివేదిక ప్రకారం, "వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇరాన్‌కు దాదాపు 5,000 షార్ట్-రేంజ్ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్‌లను సరఫరా చేయడానికి రహస్య ప్రణాళిక రూపొందించింది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్-రేంజ్ డ్రోన్‌లను కూడా అందించాలని రష్యా భావించింది.ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లురేడియో సిగ్నల్స్‌కు బదులుగా సన్నని వైర్ల ద్వారా నియంత్రించబడతాయి. దీనివల్ల శత్రువులు వీటిని 'జామ్' చేయడం (సిగ్నల్స్ కట్ చేయడం) సాధ్యం కాదు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు". అని నివేదిక ప్రచురించింది.

రష్యా తన లాంగ్-రేంజ్ డ్రోన్లలో ఎలాన్ మాస్క్‌కు చెందిన 'స్టార్‌లింక్' టెర్మినల్స్‌ను ఉపయోగించే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను దాటవేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను మధ్యప్రాచ్యంలో ఇరాన్ దళాలకు మళ్లించాలని రష్యా చూస్తోంది.కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా రష్యా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనం ప్రచురితమైంది. 

దీని కోసం రష్యాలోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుండి ఆపరేటర్లను ఎంపిక చేయాలని రష్యా నిఘా సంస్థ భావించిందని తెలిపింది. అలాగే రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను మరియు సిరియాలోని అలవైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలో ఉంది.

ట్రంప్ వ్యూహానికి కౌంటర్‌గా

ఇటీవల ట్రంప్ ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అంతే కాకుండా అమెరికా సైన్యం నేరుగా ఇరాన్‌పై దాడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేలా ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్‌లు ప్రధానంగా ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్దే మోహరించేలా ప్రణాళికలు రచించారు.  ఒకవేళ ఇరాన్‌పై అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కొవడానికి  ఈ డ్రోన్లు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement