మంత్రి లోకేష్‌కు షాకిచ్చిన మహిళలు | Women Shock To Minister Nara Lokesh In Avanigadda Constituency | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేష్‌కు షాకిచ్చిన మహిళలు

Jun 24 2026 6:36 PM | Updated on Jun 24 2026 7:02 PM

Women Shock To Minister Nara Lokesh In Avanigadda Constituency

సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో పర్యటించిన మంత్రి నారా లోకేష్‌కు మహిళలు షాకిచ్చారు. అవనిగడ్డలో బెల్టు షాపుల బాగోతాన్ని లోకేష్‌ ముందే మహిళలు బయటపెట్టారు. తమ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని లోకేష్‌ను మహిళలు నిలదీశారు. మద్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు.

మీ గ్రామంలో మద్యం షాపు ఉందా? అంటూ లోకేష్‌ ప్రశ్నించారు. అవనిగడ్డలోని వైన్ షాపు నుంచి తెచ్చి తమ గ్రామంలో మద్యం అమ్ముతున్నారని మహిళలు చెప్పారు. తమ గ్రామంలో బెల్టు షాపు లేకుండా చేయాలని మహిళలు కోరగా.. తాను చూసుకుంటానంటూ అక్కడ్నుంచి మంత్రి లోకేష్‌ జారుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement