ఈ బీచ్‌ మహిళలకు మాత్రమే! | Dubai Municipality officially opened the new Khor Al Mamzar beach | Sakshi
Sakshi News home page

ఈ బీచ్‌ మహిళలకు మాత్రమే!

May 24 2026 12:43 AM | Updated on May 24 2026 12:43 AM

Dubai Municipality officially opened the new Khor Al Mamzar beach

దుబాయ్‌ మునిసిపాలిటీ ఇటీవల మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన బీచ్‌ను ప్రారంభించింది. ‘ఖోర్‌ అల్‌ మమ్జర్‌’ పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బీచ్‌లో స్థానిక మహిళలతో పాటు మహిళా పర్యాటకులు కాలక్షేపం చేయడానికి కావలసిన వసతులను ఏర్పాటు చేశారు. దుబాయ్‌–2040 అర్బన్‌ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఈ బీచ్‌ను 27.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడం విశేషం.

ఇక్కడ మహిళలు రాత్రివేళ కూడా నిరాటంకంగా ఈతకొట్టడానికి, వినోద కాలక్షేపాలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఈతకొట్టే మహిళల భద్రత కోసం లైఫ్‌గార్డులను కూడా ఏర్పాటు చేశారు. దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ దీనిని ప్రారంభించారు. ఈ బీచ్‌లో ఫ్లోటింగ్‌ వాక్‌వే, జిమ్‌ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ బీచ్‌ నిర్మాణం కోసం దుబాయ్‌ ప్రభుత్వం 500 మిలియన్‌ దీనార్లు ఖర్చు చేసింది.

ఎడారిలో లైట్‌హౌస్‌
లైట్‌హౌస్‌లు సాధారణంగా సముద్ర తీరాల్లో ఉంటాయి. రాత్రివేళల్లో నావికులకు దారి చూపడానికి ఇవి పనికొస్తాయి. సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో లైట్‌హౌస్‌లు కనిపించవు. కనుచూపు మేరలో సముద్ర తీరంలేని ఎడారి నడిబొడ్డున లైట్‌హౌస్‌ ఉండటం విడ్డూరమే! ఈ ఇరవై అంతస్తుల లైట్‌హౌస్‌ రష్యాలోని అస్త్రాఖాన్‌ ప్రాంతంలోని ఎడారిలో ఉంది. ‘పెత్రోవ్‌స్కీ లైట్‌హౌస్‌’ పేరిట దీనిని 1741లో నిర్మించారు. తొలుత దీనిని కలపతో నిర్మించారు. గాలి దుమారానికి కూలిపోవడంతో తిరిగి 1876లో దీనిని ఇటుకలతో నిర్మించారు. ఈ లైట్‌హౌస్‌ తొలుత నిర్మించే నాటికి కాస్పియన్‌ సముద్రం దీనికి చేరువలోనే ఉండేది. తర్వాతి కాలంలో కాస్పియన్‌ సముద్రం వెనక్కు మళ్లడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement